Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌పై పాకిస్థాన్‌ తీరు మారాల్సిందే: చైనా ఫైర్

భారత్‍పై పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలపై చైనా స్పందించింది. ప్రతి విషయంలోనూ భారత్‌పై పాకిస్థాన్ నిందలు వేస్తోందని.. పాకిస్థాన్ తన తీరును మార్చుకోవాలని తేల్చి చెప్పింది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్

Advertiesment
భారత్‌పై పాకిస్థాన్‌ తీరు మారాల్సిందే: చైనా ఫైర్
, బుధవారం, 22 నవంబరు 2017 (11:07 IST)
భారత్‍పై పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలపై చైనా స్పందించింది. ప్రతి విషయంలోనూ భారత్‌పై పాకిస్థాన్ నిందలు వేస్తోందని.. పాకిస్థాన్ తన తీరును మార్చుకోవాలని తేల్చి చెప్పింది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌పై భారత్ గూఢచర్యం చేస్తుందనే వ్యాఖ్యలను చైనా కొట్టిపారేసింది. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరికి మంచివి కావని చైనా వ్యాఖ్యానించింది. 
 
అంతకుముందు.. చైనా-పాకిస్థాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌పై భారత్‌ గూఢచర్యం చేస్తోందని, పాక్‌ జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కమిటీ ఛైర్మన్‌ జనరల్‌ జుబిర్‌ మహమ్మద్‌ హయత్ ప్రకటన చేశారు. అంతటితో ఆగకుండా సీపీఈసీ ప్రాజెక్టుపై కుట్ర‌లు ప‌న్నుతూ త‌మ‌ వివాదాస్పద ప్రాంతాల్లో భారత్ హింస‌ను సృష్టించాల‌ని చూస్తుందన్నారు. 
 
ఇందులో భాగంగా భారత నిఘా సంస్థ రీసెర్చ్‌ అండ్‌ ఎనాలసిస్‌ వింగ్ (రా) ఒక జట్టును కూడా త‌యారు చేసింద‌ని ఆధారాలు లేని ఆరోప‌ణ‌లు గుప్పించారు. దీనిపై చైనా స్పందిస్తూ.. పాకిస్థాన్ ఆరోపణలను తప్పుబట్టింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అద్దె చెల్లించాల్సిందే... లతా రజినీకాంత్‌కు చుక్కెదురు