29 యేళ్ల వయసు.. 9 యేళ్ళ కెరీర్... 50 సెంచరీలు.. ఎవరు?
విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్. ఫార్మెట్ ఏదైనా దూకుడే ఆయుధంగా ఎంచుకుని పరుగుల వరద పారిస్తున్న క్రికెటర్. ఇన్‌స్టంట్ వన్డే ఫార్మాట్‌తో పాటు సంప్రదాయ టెస్ట్ ఫార్మాట్‌లోనూ సెంచరీల మోత మోగి
విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్. ఫార్మెట్ ఏదైనా దూకుడే ఆయుధంగా ఎంచుకుని పరుగుల వరద పారిస్తున్న క్రికెటర్. ఇన్‌స్టంట్ వన్డే ఫార్మాట్‌తో పాటు సంప్రదాయ టెస్ట్ ఫార్మాట్‌లోనూ సెంచరీల మోత మోగిస్తున్నాడు. తాజాగా మరో సెంచరీని తన ఖాతాలో జమ చేసుకున్నాడు.
కోల్‌కతా వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 50 సెంచరీల క్లబ్‌లో చేరాడు. 29 యేళ్ల వయసులో 9 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లోనే కోహ్లీ ఈ తరహా రికార్డును చేరుకోవడం అదో ప్రత్యేక రికార్డు కావడం గమనార్హం.
వన్డేల్లో 32 సెంచరీలు... టెస్టుల్లో 18 సెంచరీలు... కలుపుకుని తన క్రికెట్ కెరీర్‌లో మొత్తం 50 సెంచరీలు పూర్తి చేసి.. ఇంకా సెంచరీల వేట కొనసాగిస్తున్నాడు. ఇన్‌స్టంట్ వన్డే ఫార్మాట్‌తో పాటు ట్రెడిషనల్ టెస్ట్ ఫార్మాట్‌లోనూ సెంచరీల మోత మోగిస్తున్నాడు.
శ్రీలంకతో ముగిసిన కోల్‌కతా టెస్ట్‌లోనూ కొహ్లీ సెంచరీతో చెలరేగాడు. అసలు సిసలు కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్‌ను పోటీలో నిలిపాడు. లక్మల్ బౌలింగ్‌లో కవర్స్ మీదుగా కొట్టిన సిక్సర్‌తో ఇంటర్నేషనల్ కెరీర్‌లో 50 సెంచరీల క్లబ్‌లో ఎంటరయ్యాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 50 అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన 8వ బ్యాట్స్‌మెన్‌గా విరాట్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
ఇప్పటితరంలో హషీమ్ ఆమ్లా తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్లో 50 సెంచరీలు చేసిన 2వ క్రికెటర్‌గా విరాట్ రికార్డ్‌ల కెక్కాడు. భారత క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తర్వాత 50 అంతర్జాతీయి సెంచరీలు సాధించిన భారత క్రికెటర్‌గా విరాట్ చరిత్ర సృష్టించాడు.