బ్రేక్ ఫాస్ట్‌లో ఆమ్లెట్, లంచ్‌లో గ్రిల్డ్ చికెన్.. డిన్నర్లో సీఫుడ్స్ వుండాల్సిందే: కోహ్లీ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకునే ఆహారంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. మైదానంలో పరుగుల వరద పారించే కోహ్లీ అసలు డైట్‌లో ఏం తీసుకుంటున్నాడని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకునే ఆహారంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. మైదానంలో పరుగుల వరద పారించే కోహ్లీ అసలు డైట్‌లో ఏం తీసుకుంటున్నాడని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను రోజువారీగా తీసుకునే మెనూపై కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు.
ఉదయం పూట ఆమ్లెట్, ఆకుకూరలు, చేపలు తీసుకుంటానని.. మధ్యాహ్న భోజనంలో కాల్చిన కోడి మాంసం, వేయించిన బంగాళదుంపలు తప్పకుండా వుండాల్సిందేనని వెల్లడించాడు. రాత్రిపూట మాత్రం చేపలతో వండిన ఆహారం తీసుకుంటానని కోహ్లీ వెల్లడించాడు.
బ్రేక్ ఫాస్ట్‌లో ఆమ్లెట్, చేపలు, ఆకుకూరలు, బొప్పాయి, పుచ్చకాయ, గ్రీన్ టీ విత్ లెమన్ వుంటుందని కోహ్లీ వెల్లడించాడు. అలాగే మూడు కోడిగుడ్ల తెల్లసొన, ఒక కోడిగుడ్డుతో పోసిన ఆమ్లెట్ తీసుకుంటానని తెలిపాడు. రాత్రిపూట డిన్నర్లో తప్పకుండా సీఫుడ్ వుండేలా చూసుకుంటానని చెప్పాడు. పోషకాహారాన్ని మితంగా తీసుకుంటే ఫిట్‌గా వుండొచ్చునని కోహ్లీ సలహా ఇచ్చాడు.