Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#HappyBirthdayVirat : ఫార్మెట్ ఏదైనా విజయం కోహ్లీసేనదే...

భారత క్రికెట్‌లో ఇప్పుడు విరాట్ కోహ్లీ శకం నడుస్తోంది. ఆటలో దూకుడు.. మాటలో ముక్కుసూటితనం… ఈ రెండు కలిస్తే కోహ్లీ. భాతర క్రికెట్ చరిత్రలోనే వండర్ కెప్టెన్‌గా నిలిచాడు. వన్డే, టెస్ట్, టీ20 ఫార్మాట్ ఏదైన

#HappyBirthdayVirat : ఫార్మెట్ ఏదైనా విజయం కోహ్లీసేనదే...
, ఆదివారం, 5 నవంబరు 2017 (12:31 IST)
భారత క్రికెట్‌లో ఇప్పుడు విరాట్ కోహ్లీ శకం నడుస్తోంది. ఆటలో దూకుడు.. మాటలో ముక్కుసూటితనం… ఈ రెండు కలిస్తే కోహ్లీ. భాతర క్రికెట్ చరిత్రలోనే వండర్ కెప్టెన్‌గా నిలిచాడు. వన్డే, టెస్ట్, టీ20 ఫార్మాట్ ఏదైనా సరే… విజయం కోహ్లీ సేనదే. భారత్ క్రికెట్‌లో ఇప్పుడంతా యువరక్తమే. దానికి ప్రతీక కోహ్లీ. ఇంటా, బయట రికార్డులపై రికార్డులు సృష్టిస్తున్నాడు ఈ ఢిల్లీ కుర్రాడు. 28 ఏళ్లకే ఎన్నో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాంటి క్రికెటర్ కోహ్లీ ఆదివారంతో 28 యేళ్లు పూర్తి చేసుకుని 29వ యేటలోకి అడుగుపెడుతున్నాడు. 
 
ధోనీ వారసుడిగా భారత క్రికెట్ జట్టు పగ్గాలు చేపట్టిన కోహ్లీ.. ఫస్ట్ మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. అద్భుతమైన గెలుపుతో విజయ పరంపరకు శ్రీకారం చుట్టాడు. అన్ని ఫార్మాట్‌లలోనూ… టాప్ ఫామ్‌లో ఉన్న కోహ్లీ… మరెన్నో విజయాలు సాధిస్తాడోనని అభిమానులు లెక్కలేసుకుంటున్నారు.
 
కెప్టెన్‌‌గా మొదటి వన్డేలో తన కెరీర్‌లో 27వ సెంచరీ రికార్డ్ చేశాడు. ఛేజింగ్ కింగ్‌గా తనకున్నపేరును మరోసారి నిలబెట్టాడు. టీమిండియా 3 సార్లు 350కి పైగా పరుగుల లక్ష్యాన్ని సక్సెస్ ఫుల్‌గా ఛేజ్ చేసింది. అందులో ప్రతిసారి కోహ్లీ కంట్రిబ్యూషన్ ఉంది. ఆ 3 సార్లు కూడా కోహ్లీ సెంచరీలు కొట్టాడు. కెప్టెన్‌గా అదనపుభారం తన నెత్తిన పడినా… కోహ్లీ బ్యాటింగ్‌పై ఎలాంటి ప్రభావమూ కనిపించదు. వైస్‌కెప్టెన్‌గా ఉన్ననాటి ఊపునే ఫస్ట్ వన్డేలోనూ కంటిన్యూ చేశాడు. 
 
బ్యాట్‌తోనే కాదు.. నోటితో కూడా ఫుల్‍‌‌ఫామ్‌లో ఉంటాడు. ఆస్ట్రేలియన్లకు పోటీగా గ్రౌండ్‌లో మాటల యుద్ధానికి దిగాడు. స్లెడ్జింగ్‌పై మాజీ ప్లేయర్స్ నుంచి విమర్శలొస్తున్నా… దూకుడే తన బలమంటున్నాడు. కెప్టెన్‌గా కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతానని స్పష్టంచేస్తున్నాడు. జట్టు ఏదైనా గెలుపు మాత్రం తమనే వరించాలని కోరుకున్న కోహ్లీ.. మున్ముందు మరిన్ని విజయాలు చేకూర్చి పెట్టాలని కోరుకుందాం. 


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండో టీ20 కివీస్‌దే... ఉత్కంఠగా మారనున్న మూడో టీ20