Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ కోసం ఏనుగు వద్దకెళ్లి ప్రాణాలు కోల్పోయాడు (వీడియో)

స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని.. సెల్ఫీల కోసం సాహసాలు చేసే వారు అధికమవుతున్నారు. సెల్ఫీలకు దిగి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు దిగుతున్నారు. వన్యమృగాల వద్దకెళ్లి ప్రాణాలు క

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2017 (17:51 IST)
స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని.. సెల్ఫీల కోసం సాహసాలు చేసే వారు అధికమవుతున్నారు. సెల్ఫీలకు దిగి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు దిగుతున్నారు.

వన్యమృగాల వద్దకెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. మొన్నటికి మొన్న బాహుబలి 2 చిత్రంలో ప్రభాస్ ఏనుగు తొండంపై కాలు పెట్టి పైకి ఎక్కే సీన్‌‌ను లైవ్‌లో చేయాలనుకున్న కేరళ యువకుడిపై ఏనుగు తొండంతో దాడి చేసింది. 
 
అచ్చం బాహుబలి2 తరహాలో కేరళకు చెందిన ఓ యువకుడు ఏనుగు తొండంపై ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఏనుగుకు అరటిపండు అందించాడు. ఆ తర్వాత ఏనుగు తలపై ముద్దు పెట్టాడు. అంతటితో ఆగకుండా మెల్లగా ఏనుగు దంతాలు పట్టుకుని పైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు.

అయితే ఏనుగు ఒక్కసారిగా అతన్ని తొండంతో విసిరికొట్టింది. దీంతో ఆ యువకుడు గాల్లోకి ఎగిరి పడ్డాడు. అతడిని ఆస్పత్రిలో చేర్పించి అతడి స్నేహితుడు కాపాడాడు.  తాజాగా సెల్ఫీ మీద‌ మోజుతో ఏనుగు వ‌ద్ద‌కు వెళ్లిన 40 ఏళ్ల వ్య‌క్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న పశ్చిమ బెంగాల్‌లో గురువారం చోటుచేసుకుంది.
 
కోల్‌కతాలోని జల్‌పాయ్‌గురి జిల్లాలో ఓ బ్యాంకుకు సెక్యూరిటీ గార్డ్‌గా ప‌నిచేస్తోన్న సాదిఖ్ అనే వ్య‌క్తి ప‌ని ముగించుకుని ఇంటికి వెళ్తోన్న స‌మ‌యంలో అటవీ ప్రాంతంలోని హైవేపై ఓ ఏనుగుని చూశాడు. సంతోషంతో దాని వ‌ద్ద‌కు వెళ్లి త‌న మొబైల్‌తో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ ఏనుగు ఒక్కసారిగా తొండంతో దాడి చేయ‌డంతో ప్రాణాలు కోల్పోయాడు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతంగా ఉంది... కానీ ఆ ఒక్క నిమిషం నిరాశపరిచింది : రాజమౌళి

Sreeleela in 2025: గుంటూరు కారం తర్వాత బ్రేక్.. మళ్లీ కొత్త ప్రాజెక్టులతో శ్రీలీల బిజీ బిజీ

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

Rashmika : సక్సెస్ క్వీన్ గా మారిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న

Ram: రామ్ పోతినేని 22వ చిత్రం రాజమండ్రి షెడ్యూల్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments