Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంటలు గంటలు కుర్చీలకే అతుక్కుపోతే.. పైల్స్ తప్పదండోయ్

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (15:25 IST)
గంటలు గంటలు కూర్చీలకే అతుక్కుపోతున్నారా.. అయితే పైల్స్‌ ముప్పు తప్పదని అంటూ హెచ్చరిస్తున్నారు.. వైద్యులు. అలా గంటల పాటు కూర్చుని పనిచేసే వారు ఆహారంలో పీచు అధికంగా వుండేలా చూసుకోవాలని.. వారు సూచిస్తున్నారు. తాజా కూరగాయలు, ఆకుకూరలను రోజూ డైట్‌లో చేర్చుకోవాలి. 
 
కదలకుండా ఒకే ప్రదేశంలో కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఉన్నవారు ఎక్కువగా పైల్స్ సమస్య బారిన పడుతుంటారు. అలాగే ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు వంటి వాటితో మొలలు వస్తుంటాయి. నీరు తక్కువగా తాగడం, ఫాస్ట్‌ ఫుడ్స్‌, వేపుళ్లు అతిగా తినడం వంటివి కూడా ఇందుకు కారణం అవుతాయి. 
 
పైల్స్ నివారణకు పీచు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. అంతేగాకుండా సోయా బీన్స్, బ్లాక్ బీన్స్, పీచు అధికంగా ఉండే కూరగాయలు, ధాన్యాలు వంటివి పైల్స్ రోగాన్ని నిరోధిస్తాయి. వీటితో పాటు మామిడి, నిమ్మ, బొప్పాయి మొదలైన పండ్ల రసాలు రోజూ తాగాలి. 
 
నిమ్మ, బెర్రీలు, ఆపిల్స్, టమోటాలు మొదలైనవి పైల్స్ నివారణకు ఉపయోగపడతాయి. అంజీర పండును రాత్రంతా నీటిలో నానపెట్టి ఉదయం పరగడుపును తింటే పైల్స్ వ్యాధి నయమైపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తాంత్రికుడి మాటలు నమ్మి బతికున్న కోడిపిల్లను మింగేశాడు..

దేశంలోనే అత్యంత ఆరోగ్యకరమైన గ్రామంగా బొమ్మసముద్రం

18న మార్చి నెల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం : ఐదుగురి మృతి

ఈ-కార్ రేస్‌కు నిధుల మళ్లింపు - ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్టు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

తర్వాతి కథనం
Show comments