పెళ్లికి ముందే హెచ్.ఐ.వి టెస్ట్ చేయిస్తే తప్పేంటి : గోవా మంత్రి

మంగళవారం, 9 జులై 2019 (12:59 IST)
పెళ్లికి ముందే హెచ్.ఐ.వి టెస్ట్ చేయిస్తే తప్పేంటి అని గోవా మంత్రి వరకు ప్రశ్నిస్తున్నారు. ఆయన పేరు విశ్వజిత్ రాణే. గోవా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం సాగుతోంది. అందుకే మంత్రిగారు ఈ తరహా ప్రతిపాదన చేశారు. గోవా రాష్ట్రంలో పెళ్లి రిజిస్ట్రేషన్‌కు ముందే హెచ్.ఐ.వి టెస్ట్ చేయించేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకుని రావాలని ఆయన ఓ ప్రతిపాదన చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పెళ్లికి ముందు వధూవరులిద్దరికి హెచ్ఐవీ పరీక్షలు చేయించుకునే పద్ధతి అమలును పరిశీలించాలని తాను న్యాయశాఖను కోరామని ఆరోగ్య మంత్రిగా ఉన్న విశ్వజిత్ తెలిపారు. పెళ్లికి ముందు హెచ్ఐవీ పరీక్షలు జరిపించుకునేలా ప్రజాఆరోగ్య చట్టంలో ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే సవరణలు తీసుకురావాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
 
గోవాలో 1987 నుంచి ఇప్పటివరకు 17,122 మంది రోగులకు హెచ్ఐవీ సోకిందని తేలినందున ఈ నిర్ణయం తీసుకోనున్నామని  మంత్రి వివరించారు. దీంతోపాటు తలసీమియాతో బాధపడే పిల్లలు పుట్టకుండా ఉండాలంటే పెళ్లికి ముందు తలసీమియా పరీక్ష కూడా చేయించుకోవాలని మంత్రి సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం షో మాస్టర్లు వద్దు... టాస్క్ మాస్టర్లు కావాలి.. లేదంటే టీడీపీ మటాష్ : కేశినేని నాని