నేటి యువతరం ప్రేమ కోసం ఏమైనా చేస్తున్నారు. ప్రేమించడం మొదలు పెట్టారంటే తన చుట్టుపక్కలా ఏం జరిగినా కన్నెత్తి చూడరు. ఇంతకీ ఇంట్లో ఏం జరిగినా పట్టించుకోరు. ఇంట్లో జరుగుతుంది, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అనేది ప్రస్తుత జనరేషన్‌కు ఏమాత్రం అక్కర్లేదు.
చూసిన వెంటనే ప్రేమలో పడటం, ఫేస్ బుక్ ప్రేమ, ఇంటర్నెట్, ఫోన్‌ల ద్వారా ప్రేమాయణాలు కొనసాగిస్తున్న నేటి యువత.. తమ తల్లిదండ్రుల మనోభావాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అంతేకాదు.. చిగురించిన ప్రేమ రాలిపోయే ముందే పెళ్లి చేసేసుకోవాలని యూత్ అవసరపడుతోంది. ఇందుకు గాను తల్లిదండ్రుల అంగీకారాన్ని సైతం లెక్క చేయట్లేదు.
వారి సమ్మతం లేకుండానే పెళ్లిల్లు జరిగిపోతున్నాయి. ఆర్థిక పరంగా నేటి యూత్ సెటిల్ కావడంతో తల్లిదండ్రులపై ఆధారపడకుండా ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకుని వారి వారి జీవితాన్ని వారే ఎంచుకునే స్థాయికి ఎదిగిపోతున్నారు.
అయితే తల్లిదండ్రుల సమ్మతంతో పెళ్లి చేసుకోవాలంటే ఈ పది సూత్రాలు పాటించండి
1. ప్రేమ గురించి చెప్పి కాస్త వారికి ఆలోచించే టైమ్ ఇవ్వండి
2. వారు మీ ప్రేమను ద్వేషించేందుకు కారణం ఏమిటో తెలుసుకోండి.
3. దీని గురించి ప్రేయసి/ప్రియుడి దగ్గర చర్చించకండి
4. మీ కుటుంబీకులతో మనస్సు విప్పి మాట్లాడండి.
5. మీరు కూడా వారి స్థానంలో ఉండి ఆలోచించండి.
6. మీ ప్రేమను తల్లిదండ్రులకు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి.
7. తల్లిదండ్రులను ద్వేషించకండి
8. ఓపికతో మీ ప్రేమ నిజమైందని నిరూపించండి
9. తల్లిదండ్రులకు అనుగుణంగా మీ ప్రేయసి/ ప్రియుడి అలవాట్లను మార్చేందుకు ప్రయత్నించండి.
10. తల్లిదండ్రులు మీకు ప్రాధాన్యం ఇస్తున్నారనే విషయాన్ని మరిచిపోకండి
కొన్ని సందర్భాల్లో ఈ పది సూత్రాలు ఉపయోగపడతాయి. కానీ తల్లిదండ్రులు గౌరవం కోసం వద్దంటే మాత్రం మీ ప్రేమపై మీకు అపార నమ్మకముంటే మీరే మీ జీవితాన్ని ఎంచుకోవచ్చు.