తాగుడు... ఇంట్లోకి రానివ్వలేదు.. యువకుడి ఆత్మహత్య.. ప్రేయసి కూడా?

ఆదివారం, 2 జూన్ 2019 (17:48 IST)
తాగుడు అలవాటు ఆ ప్రేమికులను తిరిగి రాని లోకాలకు పంపేసింది. సాధారణంగా ప్రేమకు తల్లిదండ్రులు అడ్డు చెప్తారు. కానీ ఇక్కడ తాగుడు అలవాటును మానుకోవాలని తల్లిదండ్రులు హెచ్చరించడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమికుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకున్నాక ప్రేయసి కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. చెన్నై, కోవిలంబాక్కంకు చెందిన మణికంఠన్ (22) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు అదే ప్రాంతానికి చెందిన దివ్య (22)ను ప్రేమిస్తున్నాడు. తాగుడుకు అలవాటుపడిన మణికంఠన్ రోజూ తాగుతూ ఇంటికొచ్చి తల్లిదండ్రులతో జగడానికి దిగేవాడు. ఇలా మే 29న కూడా తాగి ఇంటికొచ్చాడు. దీంతో తల్లిదండ్రులు మందలించారు. 
 
ఇంకా ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో మనస్తాపానికి గురైన మణికంఠన్ తల్లిదండ్రుల ముందే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆపై షాక్ అయిన తల్లిదండ్రులు అతనిని ఆస్పత్రికి తరలించేలోపు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న దేవి తన ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం పిజ్జా, బర్గర్లు వద్దు.. చికెన్ బటర్, పనీర్ బటర్ మసాలా అమ్మండి..