Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ 6 ప్రయోజనాలు తెలిస్తే సోంపూని తినకుండా వుండరు..

ఈ 6 ప్రయోజనాలు తెలిస్తే సోంపూని తినకుండా వుండరు..
, సోమవారం, 8 జులై 2019 (19:38 IST)
సోంపూ అనగానే భోజనానంతరం అరగడానికి ఉపయోగిస్తాము అనే విషయం మనందరికి తెలిసిందే.... కానీ సోంపును ఉపయోగించి పలురకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. సోంపూలో పీచు, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, మాంగనీసు వంటి పోషకగుణాలతో పాటు మరెన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.

ఇందులోని విటమిన్- సి రోగనిరోదక శక్తిని పెంచి దెబ్బతిన్న కణాలను బాగు చేస్తుంది. అంతేకాకుండా హానికర ఫ్రీరాడికల్స్‌ను నియంత్రిస్తుంది. సోంపు మన ఆరోగ్యానికి ఏవిధంగా ఉపయోగపడుతుందో చూద్దాం.
 
1. సోంపూ గింజల్లో యాంటీఆక్సీడెంట్లతో పాటు ఔషద గుణాలు కలిగిన కర్బన పదార్దాలు చాలానే ఉన్నాయి. అవన్నీ యాంటీ క్యాన్సర్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు కలిగి ఉండడంతో అనేక రకములైన వ్యాధులను అడ్డుకుంటాయి.
 
2. సోంపు గింజల్లోని పీచు కారణంగా హృద్రోగాలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇందులోని పొటాషియం బీపీ పెరగకుండా కాపాడుతుంది.
 
3. ప్రతిరోజూ రెండు గ్రాముల గింజలతో కషాయం చేసుకుని తాగేవాళ్లల్లో ఆకలి తగ్గుతుందట. ఇందులోని అనెతోలె అనే గాఢతైలానికి ఆకలిని తగ్గించే గుణం ఉందని పరిశోధనల్లో తేలింది.
 
4. సోంపులో వుండే పోషకాలు బాలింతల్లో పాలు బాగా పడేలా చేస్తాయి.
 
5. సోంపూ వయసుతో పాటు వచ్చే వృద్దాప్యాన్ని, మెనోపాజ్‌లో తలెత్తే సమస్యల్ని తగ్గిస్తుంది. కాబట్టి మన రోజూ వారీ ఆహారంలో కొంచెం సోంపు గింజల్ని ఏదో ఒక రూపంలో చేర్చుకోవడం చాలా మంచిది.
 
6. ఈ గింజలను తినడం వల్ల రొమ్ము, కాలేయ క్యాన్సర్ కణాలు వ్యాపించకుండా అడ్డుకునే శక్తి ఉందని పలు రకాల పరిశీలనల్లో నిర్దారణ అయ్యింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మర్రిచెట్ల పండ్లు.. ఆ వ్యాధిని దూరం చేస్తుందట? (video)