Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పురుషులకి ఉల్లి చేసే ఉపయోగం తెలిస్తే వదలరంతే...

Advertiesment
పురుషులకి ఉల్లి చేసే ఉపయోగం తెలిస్తే వదలరంతే...
, గురువారం, 4 జులై 2019 (16:49 IST)
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు మన పెద్దలు. సాధారణంగా ఉల్లిపాయ అటే కూరల్లో వాడుకునేది అనే అభిప్రాయమే చాలామందిలో ఉంటుంది. పచ్చి ఉల్లిపాయను ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే అనేక రకములైన వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.

ముఖ్యంగా షుగరు, శృంగార సమస్యలకు పచ్చి ఉల్లిపాయ ఒక మంచి ఔషదంలా పని చేస్తుంది. అలాగే మహిళల్లో వచ్చే ఋతుక్రమ సమస్యలు తగ్గుతాయి. దీనివల్ల ఆరోగ్యరపమైన ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.
 
1. యాభై గ్రాముల పచ్చి ఉల్లిపాయ ఇరవై యూనిట్ల ఇన్సులిన్‌తో సమానం. ఎక్కువ షుగర్‌తో బాధపడేవారు దీనిని ఏడు రోజులు క్రమంతప్పకుండా తింటే షుగరు అదుపులోకి వచ్చేస్తుంది.
 
2. ఉల్లిపాయను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించి చల్లారినాక తాగితే మూత్రంలో మంట తగ్గిపోతుంది.
 
3. మగవారిలో లైంగక సామర్ద్యాన్ని పెంచడంలో పచ్చి ఉల్లిపాయ అద్బుతంగా పని చేస్తుంది. ఇది కోరికను పెంచడమే కాకుండా జననేంద్రియాలను పటిష్టంగా చేస్తుంది. తెల్ల ఉల్లిపాయను పొరలుగా చీల్చి, దంచి వెన్నతో కలిపి వేయించుకుని స్పూను తేనెతో కలిపి ప్రతిరోజు పరగడుపున ఆ మిశ్రమాన్ని తీసుకుంటే అది అద్బుతమైన శృంగార టానిక్‌గా పని చేస్తుంది. అంతేకాకుండా పురుషుల్లో వీర్యకణాల సమస్య తగ్గుతుంది. పడక గదిలో మంచి జోష్ వస్తుంది.
 
4. గుండెజబ్బు, బీపీతో బాధపడేవారు ప్రతిరోజూ వంద గ్రాముల ఉల్లిపాయను తీసుకోవడం చాలా మంచిది. ఇది రక్తంలోని కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది.
 
5. పంటినొప్పితో ఇబ్బంది పడేవారు ఆ పంటికి లేదా చిగురుకు దగ్గరలో చిన్న ఉల్లి గడ్డను ఉంచుకుంటే కాసేపటికి ఆ నొప్పి తగ్గుతుంది. అంతేకాకుండా ఉల్లి లోని ఐరన్‌ని మన శరీరం తేలికగా జీర్ణం చేసుకుంటుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడేవారికి ఉల్లిపాయ చాలా మంచిది.
 
6. ఉల్లిపాయను గుజ్జుగా దంచి దానికి చిటికెడు నల్లఉప్పు పొడిని కలిపి రోజూ రెండుమూడు సార్లు తింటూ ఉంటే నీళ్ల విరేచనాలు, వాంతులు అదుపులోకి వస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ.. ఆ... అమ్మో పిక్క పట్టేసింది... ఏం చేయాలి?