బీర్ తాగితే.. పొట్ట పెరుగుతుందని చాలామందిలో ఉన్న నమ్మకం. అయితే.. ఇటీవల జరిగిన కొన్ని స్టడీస్‌లో బీర్ తాగితే పొట్ట రాదు అని తేలింది. లండన్ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో బీర్ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ వస్తుందనేది అబద్ధం అని తేలింది.
కొవ్వు పెరగడం, పొట్ట రావడం సంగతి అటుంచితే.. బీరు లోని ఫ్లేవనాయిడ్లు బరువు తగ్గించడానికి తోడ్పడుతాయట. బీరు వల్ల ఆరోగ్యానికి ఎలాంటి మేలు జరుగుతుందో చదవండి...
1. మనిషి పదికాలాల పాటు, ఆరోగ్యంగా ఉండాలంటే గుండె బాగుండాలి. బ్రిటీష్ మెడికల్ జర్నల్ పబ్లిష్ చేసిన ఓ ఆర్టికల్‌లో బీర్ తాగడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం 24.7 శాతం తగ్గుతుందని తేల్చారు. ఇందుకు కారణం ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు మేలు చేయడమేనట.
2. బీరు తాగడం వల్ల వయసు మీద పడిన తర్వాత వచ్చే కంటి చూపు లోపాలు రావట. కెనడాలో చేసిన స్టడీలో ఈ విషయం బయటపడింది. ప్రతిరోజూ ఓ గ్లాస్ బీర్ తాగితే.. కంటిచూపు మెరుగవుతుందట.
3. బీరులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడుతాయట. శరీరంలో క్యాన్సర్ కణాలను పెంచే ఎంజైములతో బీర్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫైట్ చేసి వాటిని నాశనం చేస్తాయట. ఒరెగాన్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు చేసిన స్టడీలో ఈ విషయం తేలింది.
4. బీర్ తాగినప్పుడు ఒత్తిడంతా పోతుందట. ఆ సమయంలో బ్లడ్ ప్రెషర్ కూడా అదుపులోకి వస్తుందట. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు హై బీపీతో బాధపడుతున్న కొంతమందికి బీర్ తాగించి చేసిన అధ్యయనంలో తేలింది.
5. శరీరానికి ఎంత ఫైబర్ అందితే.. జీవక్రియలు అంత సక్రమంగా జరుగుతాయి. అందుకే.. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకొమ్మని సలహా ఇస్తుంటారు. అయితే.. బీర్‌లో 20 ఫైబర్ శాతం ఉంటుందట.
6. చాలామంది డాక్టర్లు కిడ్నీల్లో రాళ్లతో బాధపడే వారికి అప్పుడప్పుడు ఓ బీర్ తీసుకోమంటారు. దానిలో రాళ్లు కరిగించే గుణాలున్నాయి. పొటాషియం, మెగ్నీషియం బీరులో పుష్కలంగా ఉండి, కిడ్నీలో రాళ్లు కరిగించడానికి సహాయపడతాయి.
7. బీరు వల్ల ఇన్ని లాభాలున్నప్పటికీ డాక్టర్లు ఒక హెచ్చరిక చేస్తున్నారు. మంచి చేస్తుందని అదే పనిగా సీసాల కొద్దీ బీర్లు తాగితే మాత్రం ఆరోగ్యానికి ముప్పు తప్పదు, రోజుకో బాటిల్‌కు మించి బీరు తాగరాదని అంటున్నారు.