Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాదములతో ఆరోగ్యవంతమైన రక్షాబంధన్‌ను వేడుక చేయండి

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (20:29 IST)
ఆగస్టు వచ్చింది. వేడుకలూ ఆరంభమయ్యాయి. భారతదేశ వ్యాప్తంగా కుటుంబాలన్నీ కూడా రక్షాబంధన్‌ వేడుకల కోసం సిద్ధమవుతున్నాయి. తోబుట్టవుల నడుమ బంధాన్ని గౌరవించే సందర్భమిది. తిరుగులేని మద్దతు యొక్క వాగ్ధానం మరియు సర్వవేళలా తమ సోదరికి రక్షణగా నిలబడి కాపాడతామనే సోదరుని ప్రతిజ్ఞకు ప్రతీకగా సోదరీమణులు అతి సరళమైన దారం లేదా రాఖీని తమ సోదరుల ముంజేతికి కడుతుంటారు.
 
రక్షాబంధన్‌ పండుగ వేళ తమ సోదరిలకు బహుమతులు అందించడం అతి ముఖ్యమైన సంప్రదాయంగానూ వెలుగొందుతుంది. ఈ సంవత్సరం, మహమ్మారి భయాలు కొనసాగుతున్న వేళ, కుటుంబ ఆరోగ్యం మరింత ప్రాధాన్యతాంశం అయింది. అందువల్ల, తమ బహుమతుల ఎంపికను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరమూ ఉంది. ఆలోచనాత్మకంగా బాదములు లాంటి బహుమతులు ఆ బహుమతి అందుకున్న వారి ఆరోగ్యమూ మెరుగుపరుస్తాయి.  
 
బాదములలో పోషకాలైనటువంటి విటమిన్‌ ఈ, మెగ్నీషియం, ప్రొటీన్‌, రిబోఫ్లావిన్‌, జింక్‌ మొదలైనవి ఉంటాయి. ఆరోగ్యవంతమైన జీవితానికి ఇవన్నీ అవసరం. తరచుగా బాదములు తినడం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయని  శాస్త్రీయంగా నిరూపితమైంది.
 
గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటుగా మధుమేహం, బరువు నిర్వహణ మరియు చర్మ ఆరోగ్యం మెరుగుపడటం జరుగుతుంది. వీటితో పాటుగా, బాదములు అత్యంత రుచికరమైనవి. పలు భారతీయ వంటకాలకు చక్కటి రుచినీ ఇవి అందిస్తాయి. ఆకలిని తీర్చేగుణాలు దీనిలో ఉండటం వల్ల చక్కటి స్నాక్‌గానూ ఇది నిలుస్తుంది. బాదములు అందించే ఈ అపారమైన ఆరోగ్య ప్రయోజనాల కారణంగా, రక్షాబంధన్‌  వేడుకలలో తోబుట్టువులకు బహుమతిగా అందించడానికి ఖచ్చితంగా ఇవి అద్భుతమైన బహుమతిగా నిలుస్తాయి.
 
సుప్రసిద్ధ బాలీవుడ్‌ నటి సోహాఅలీఖాన్‌ మాట్లాడుతూ, ‘‘కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడపటానికి, బహుమతులు మార్చుకోవడానికి అత్యుత్తమ సందర్భాలలో ఒకటిగా రక్షాబంధన్‌ ఉంటుంది. బహుమతులను ఎంచుకునే సమయంలో, నా విధానమెప్పుడూ కూడా ఆలోచనాత్మకంగా ఆ బహుమతులు ఉండటంతో పాటుగా ప్రియమైన వారి జీవితానికి ఏదో ఒక రూపంలో అదనపు విలువ అందించాలని కోరుకుంటుంటాను.
 
నా వరకూ వ్యక్తిగతంగా బాదములు చాలాఇష్టమైనవి. వీటిలో విభిన్నమైన పోషకాలు అయినటువంటి విటమిన్‌ బీ 2, ఫాస్పరస్‌, మెగ్నీషియం, ప్రొటీన్‌ మొదలైనవి ఉన్నాయి. ఆరోగ్యవంతమైన జీవితం గడిపేందుకు ఇవి అత్యంత కీలకం. అదనంగా, బాదములలో జింక్‌, రాగి, ఫోలేట్‌, ఐరన్‌ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా రోగ నిరోధక శక్తి మెరుగ్గా పనిచేసేందుకు దోహద పడతాయి. బాదములను బహుమతిగా అందించడం అనేది నా తోబుట్టువులకు మంచి ఆరోగ్యాన్ని అందించడానికి ప్రతీకగా నిలుస్తుంది !’’ అని అన్నారు
 
న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ, ‘‘ప్రస్తుత మహమ్మారి గతానికన్నా మిన్నగా ఒకరి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఆవశ్యకతను వెల్లడించింది. అదే సమయంలో అత్యుత్తమ జీవనశైలి అనుసరించాల్సిన అవసరమూ తెలిపింది. రక్షాబంధన్‌ లాంటి పండుగలు ఈ మార్పును చేసుకునేందుకు ఓ చక్కటి అవకాశంగా నిలుస్తుంది. 
ఇలా అతి సులభంగా చేసే మార్గమేదైనా ఉందంటే అది బాదములు లాంటి ఆరోగ్యవంతమైన బహుమతులు అందించడం. 
తరచుగా బాదములు తినడం వల్ల యువతకు ఆరోగ్య పరంగానూ చాలా మంచిది. ఎందుకంటే, యువ భారతం ఇప్పుడు జీవనశైలి వ్యాధులు అయినటువంటి ప్రీ డయాబెటీస్‌ లేదా డయాబెటీస్‌ బారిన పడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఇటీవల నిర్వహించిన  ఓ అధ్యయనంలో, బాదములను స్నాక్స్‌గా తీసుకుంటే టోటల్‌ మరియు ఎల్‌డీఎల్‌  కొలెస్ట్రాల్‌ స్ధాయిలు మెరుగయ్యాయి మరియు కేవలం 12 వారాల వినియోగంతో హెచ్‌బీఏ1సీ స్ధాయిలు కూడా గణనీయంగా తగ్గాయి. 
 
ఈ డైటరీ వ్యూహంతో ప్రీ డయాబెటీస్‌ నుంచి  టైప్‌2 డయాబెటీస్‌గా మారడాన్ని ఆలస్యం చేసుకోవడం లేదా నివారించడం యువతలో సాధ్యమవుతుంది. అందువల్ల, ఈ పండుగలో బాదములను బహుమతిగా అందించడం అలవాటుగా మార్చుకోండి’’ అని అన్నారు. ఈ రక్షాబంధన్‌ వేళ, మీరు అభిమానించే వారికి బాదముల ఆశీర్వాదాన్ని అందించండి. ప్రేమ, చక్కటి ఆరోగ్యమూ పెంపొందించుకోండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

తర్వాతి కథనం
Show comments