Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత స్వాతంత్ర్యానికి 75 యేళ్లు పూర్తి

భారత స్వాతంత్ర్యానికి 75 యేళ్లు పూర్తి
, ఆదివారం, 15 ఆగస్టు 2021 (09:39 IST)
ప్రతి దేశానికి పరుల పాలన నుంచి విముక్తి లభించిన రోజును స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. దాదాపు 200 ఏళ్ల బ్రిటిష్ పాలనలో బానిసత్వాన్ని  అనుభవించిన భారత పౌరులు.. 1947, ఆగస్టు 15న మన దేశం ఈ బానిసత్వం నుండి విముక్తిని పొందారు. 
 
అప్పటి నుంచి ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటూ వస్తున్నారు. ఈ వేడుకలు జరుపుకునేందుకు వీలుగా ఆగస్టు 15 తేదీని జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి నేటితో 75 ఏళ్లు పూర్తవుతున్నాయి. 
 
ఈ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని మోడీ ఎనిమిదో సారి ఎగురవేశారు. ఎర్రకోట వద్ద మన సైనికులు చేసే సాహసాలు, విన్యాసాలు అబ్బురపరిచాయి. 
 
వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలు ఆయా రాష్ట్రాల పురోగతిని ప్రతిబింభించేలా చేశాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఎక్కువగా వ్యవసాయం, కళలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పంద్రాగస్టు వేడుకలు : ఎర్రకోటపై 8వ సారి జెండా ఎగురవేసిన ప్రధాని మోడీ