Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

75వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ ‘మౌకా హై’: తిరుగులేని భారతీయ ఆత్మకు నివాళులర్పిస్తున్న దాల్మియా భారత్‌ గ్రూప్‌

75వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ ‘మౌకా హై’: తిరుగులేని భారతీయ ఆత్మకు నివాళులర్పిస్తున్న దాల్మియా భారత్‌ గ్రూప్‌
, శనివారం, 14 ఆగస్టు 2021 (18:54 IST)
అజాదీ కీ అమృత్‌ మహోత్సవ్‌ను భారతదేశం వేడుక చేసుకుంటున్న వేళ, దాల్మియా భారత్‌ గ్రూప్‌ మరియు భూషణ్‌ కుమార్‌ యొక్క టీ-సిరీస్‌లు ఈ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ ప్రత్యేక గీతం విడుదల చేసి దేశ ప్రజలలో ఆ స్ఫూర్తిని రగిలించాయి. ‘మౌకా హై’ శీర్షికన విడుదల చేసిన ఈ గీతాన్ని బీ ప్రాక్‌ ఆలాపించగా, రోచక్‌ కోహ్లీ స్వరపరిచారు. మనోజ్‌ ముంతాషిర్‌ గీత రచన చేశారు.
 
తిరుగులేని 136 కోట్ల మంది భారతీయుల స్ఫూర్తిని వేడుక చేసే రీతిలో ‘మౌకా హై’ పాట ఉంటుంది. నేడు వివిధ రంగాలలో అశేష కనబరిచిన వ్యక్తులను వేడుక చేస్తూనే, తమ కలలను సాకారం చేసుకునేందుకు కృషి చేయాల్సిందిగా స్ఫూర్తినీ రగిలిస్తుంది. ఈ స్ఫూర్తిదాయక వీడియోలో విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులు కూడా కనిపిస్తారు. వీరిలో మీరాభాయ్‌ చానూ, పీవీ సింధు, హిమదాస్‌‌తో పాటుగా మరెంతో మంది ఉన్నారు.
 
ఈ ఆవిష్కరణ సందర్భంగా శ్రీ పునీత్‌ దాల్మియా, మేనేజింగ్‌ డైరెక్టర్‌, దాల్మియా భారత్‌ గ్రూప్‌ మాట్లాడుతూ, ‘‘భారత యువత ప్రతిభకు తార్కాణంగా మౌకా హై మ్యూజిక్‌ వీడియో నిలుస్తుంది. యువతతో కూడిన దేశంగా ఈ కష్టకాలంలో కూడా ఆశను వదులుకోకూడదనే స్ఫూర్తి స్పష్టంగా అంతర్జాతీయంగా సూపర్‌ పవర్‌గా మారగలమనే నమ్మకాన్నీ కలిగిస్తుంది. ఈ మ్యూజిక్‌ వీడియో కోసం టీ-సిరీస్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాం. జాతి నిర్మాణంలో దాల్మియా భారత్‌ గ్రూప్‌ నిబద్ధత, కష్టంను సైతం ఈ పాట ప్రతిబింబిస్తుంది’’ అని అన్నారు.
 
టీ-సిరీస్‌ అధినేత భూషణ్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘‘మౌకా హై మ్యూజిక్‌ వీడియో వీక్షించిన తరువాత ప్రతి ఒక్కరూ గర్వంగా భావించగలరు. మనకు స్ఫూర్తి కలిగించిన ఐకాన్స్‌కు నివాళి మాత్రమే కాదు, ప్రతి భారతీయుడూ అత్యుత్తమమైనది మాత్రమే చేయాలనీ ఇది వెల్లడిస్తుంది’’ అని అన్నారు. ఈ సంగీత నివాళిని మీరూ వీక్షించండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరరాజా కంపెనీ చెన్నైకి త‌ర‌ల‌దు: గ‌ల్లా జ‌య‌దేవ్