Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. నిందితుడిని ఎలా పట్టుకున్నారంటే?

Advertiesment
నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. నిందితుడిని ఎలా పట్టుకున్నారంటే?
, శనివారం, 14 ఆగస్టు 2021 (15:57 IST)
నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా చంపేసిన ఆ క్రూరుడిని ట్రాక్ చేసేందుకు అతడి వద్ద సెల్‌ఫోన్ కూడా లేదు. స్పాట్‌లో చిన్న క్లూ కూడా లేదు.

మరోవైపు నిందితుడ్ని అరెస్ట్ చేయాలని గ్రామస్థుల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి. దీంతో పోలీసు ఉన్నతాధికారులు 700 మంది సిబ్బందిని రంగంలోకి దించి.. 24 గంటల లోపలే  ఆ కామాంధుడిని సెల్ లోపల పడేశారు. 
 
వివ‌రాల్లోకి వెళితే.. రాజ‌స్థాన్‌లోని జైపూర్ రూర‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఓ గ్రామంలో సురేష్ కుమార్ (25) అనే వ్య‌క్తి దారిలో వెళ్తూ ఇంటి బ‌య‌ట ఆడుకుంటున్న 4 ఏళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లాడు. అక్క‌డికి 5-7 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న చెరువు వ‌ద్ద ఆ బాలిక‌పై లైంగికదాడి చేసి అనంత‌రం ఆమెను హ‌త్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. 
 
ఈ క్ర‌మంలో ఆ గ్రామ‌స్తులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టారు. నిందితున్ని వెంట‌నే ప‌ట్టుకోవాల‌ని డిమాండ్ చేశారు. దీంతో జైపూర్ రూర‌ల్ పోలీస్ సూప‌రింటెండెంట్ శంక‌ర్ ద‌త్ శ‌ర్మ ఆధ్వ‌ర్యంలో 700 మంది పోలీసులు రంగంలోకి దిగారు. స‌ద‌రు నిందితున్ని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
 
అయితే నిందితుడు సురేష్ కుమార్ వద్ద ఫోన్ లేదు. దీంతో అత‌న్ని పట్టుకోవడం ఒక ద‌శ‌లో క‌ష్ట‌త‌రంగా మారింది. ఎందుకంటే నిందితుడు ఒక చోట నుంచి మరో చోటికి మూవ్ అవుతున్నాడు. దీంతో ఎక్కడ గాలింపు జరిపినా ఆచూకీ లభ్యం కావడం లేదు. 
 
అయిన‌ప్ప‌టికీ స్థానికంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా అత‌ని క‌ద‌లిక‌ల‌పై ఫోకస్ పెట్టారు. దీంతో 24 గంట‌ల్లోనే నిందితున్ని ప‌ట్టుకుని రిమాండ్‌కు త‌ర‌లించారు. కాగా నాలుగేళ్ల బాలికపై అనాగరికంగా వ్యవహరించిన అత‌న్ని క‌ఠినంగా శిక్షించాల‌ని స్థానికులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిజిస్ట్రేష‌న్ల‌లో తవ్విన కొద్దీ అవినీతి... మండవల్లిలో రూ.2 కోట్లు స్వాహా