మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మగా ఉన్న కీలక నేత సచిన్ పైలట్ పార్టీ మారబోతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి కాషాయ నేత వ్యాఖ్యలే నిదర్శనంగా మారాయి. కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ భవిష్యత్ బీజేపీలో చేరవచ్చంటూ రాజస్థాన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్లాకుట్టి జోస్యం చెప్పారు. దీంతో పైలట్ కాషాయ తీర్దం పుచ్చుకుంటారని మళ్లీ ఊహాగానాలు ఊపందుకున్నాయి.
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై గత ఏడాది సచిన్ పైలట్ సహా ఆయనకు మద్దతు ఇచ్చే పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సమయంలోనూ పైలట్ బీజేపీలో చేరతారనే ప్రచారం సాగింది.
రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు కాసాయ పార్టీతో తాను పోరాడిన క్రమంలో బీజేపీలో తాను చేరుతాననే ప్రచారం అసంబద్ధమని అప్పట్లో పైలట్ తోసిపుచ్చారు. ఈ నెలలో రాజస్థాన్‌లో మంత్రివర్గ విస్తరణ, కీలక పదవుల నియామకాలు చేపడతారనే వార్తల నేపథ్యంలో పైలట్ బీజేపీ గూటికి చేరతారనే ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది.