ఆ సమయంలో మంచినీటిలో కొద్దిగా పంచదార కానీ ఉప్పు కానీ వేసుకుని తాగితే...

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (23:36 IST)
చాలాసార్లు మనకు తెలియకుండానే పనిలో పడి గ్లాసు మంచి నీళ్లు కూడా తాగకుండా ఉండిపోతాం. దానివల్ల మంచి నీళ్లు కూడా తాగకుండా ఉండిపోతాం. దానివల్ల డిహైడ్రేషన్ తలెత్తుతుంది. ఫలితంగా చెప్పలేని నీరసం. అందుకే ఇంటికి వచ్చిన వెంటనే ఒక గ్లాసుడు చల్లని మంచినీటిని తాగండి. శక్తి పుంజుకొంటుంది. ఆ నీటిలో కొద్దిగా పంచదార కానీ ఉప్పు కానీ వేసుకుంటే శరీరం కోల్పోయిన లవణాలు తిరిగి అందుతాయి. లేదా గ్లాసుడు పండ్లరసం... బత్తాయి, నారింజ వంటి రసాలు తాగితే మరీ మంచిది. వీటిలో ఉండే ఎ, సి, బి1 విటమిన్లకు మిమ్మల్ని హుషారుగా ఉంచే శక్తి ఉంది.
 
కప్పు ఓట్‌మీల్‌ని పాలల్లో కానీ మరే రూపంలో కానీ తీసుకొన్నా ఫలితాలుంటాయి. ఓట్‍‌మీల్ లోని పీచు.. ఇతర కార్బొహైడ్రేట్ల వల్ల శరీరానికి నూతనోత్తేజం లభిస్తుంది. దీనిలోని పొటాషియం, పాస్ఫరస్ వంటి ఖనిజలవణాలు మీ ఉత్సాహానికి ఊపునిస్తాయి. అధిక కొవ్వు సమస్య కూడా ఉండదు.
 
పెరుగు.. ఇది తక్షణ శక్తినందిస్తుంది. ఇందులోని సహజ చక్కెరలు అలసిన మనసుకి ఉత్సాహాన్నిస్తాయి. ఇక పెరుగులోని మాంసకృత్తులు క్రమంగా శక్తినందిస్తూ ఆ ఉత్సాహం ఎక్కువ సేపు నిలబడేట్టు చేస్తాయి. దీనిలోని ప్రొ బయోటిక్ బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. జలుబులో బాధపడుతుంటే ఆ చికాకులన్నీ తొలగిపోతాయి. కాబట్టి దీన్ని భోజనంలోనే కాకుండా.. రోజులో ఒకసారైనా అరకప్పు తీసుకుంటే మంచిది.
 
ఎండుద్రాక్ష, వాల్‌నట్లు, బాదం, అవిసెగింజల్లోని కొవ్వులు శరీరానికి మేలు చేస్తాయి. వీటిలోని అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా త్వరగా శక్తిని విడుదల చేస్తాయి. ఆఫీసు నుంచి అలసిపోయి వస్తే.. ఇవి గుప్పెడు తిని చూడండి. ఇవి చక్కని అల్పాహారం కూడా.
 
రోజువారీ ఆహారంలో ఇనుము ఉండేలా చూసుకొంటే మాటిమాటికీ నిస్సత్తువ ఆవరించదు. పాలకూర, తోటకూర వంటివాటిలో ఇనుము సమృద్ధిగా అందుతుంది. నిస్సత్తువ ఆవరించదు. పాలకూర, తోటకూర వంటివాటిలో ఇనుము సమృద్ధిగా అందుతుంది. నిస్సత్తువకు మరోకారణమైన రక్తహీనత సమస్య కూడా బాధించదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Bhuvaneswari: నారా లోకేష్‌ను అభినందించిన భువనేశ్వరి.. ప్రభుత్వ విద్య అదుర్స్

రెండు రోజుల్లో పెళ్లి.. ఫైనాన్షియర్ల వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య

స్కూలుకు లేటు.. వీపు మీద బ్యాగ్‌తోనే 100 గుంజీలు.. బాలిక మృతి.. ఎక్కడ?

యేడాదిగా టీచర్లు హేళన చేస్తున్నారు... సారీ మమ్మీ... నా అవయవాలను దానం చేయండి...

Rythanna Meekosam: నవంబర్ 24 నుండి 29 వరకు రైతన్న మీకోసం..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments