Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ అంటే ఏమిటి..? 16 చరిత్రాత్మక ప్రాంతాల గుర్తింపు:

Advertiesment
Azadi ka Amrit Mahotsav
, ఆదివారం, 15 ఆగస్టు 2021 (10:53 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆజాది కా అమృత్ మహోత్సవ్ పేరుతో వేడుకలను నిర్వహించనుంది. బ్రిటీష్‌ తెల్లదొరల కబంధహస్తాల నుంచి భారతమాతకు విముక్తి లభించి 75 ఏళ్లు కావస్తున్న సందర్భంగా స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. 
 
ఇందులో భాగంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలను నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టింది. ఈ కార్యక్రమాలు 75 వారాల పాటు కొనసాగుతాయి. ఇందులో క్విట్ ఇండియా ఉద్యమం గురించి ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. ‘ఆజాది కీ అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని కేంద్రం పిలుపునిచ్చింది. ఈ మహోత్సవ్‌ ఏడాదిన్నర పాటు 75 వారాలు కొనసాగుతాయి. 
 
ఆజాదీ అంటే స్వేచ్ఛ.. అమృత్ అంటే అజ‌రామ‌రం.. మ‌హోత్సవ్ అంటే అతిపెద్ద సంరంభం.. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అంటే అజ‌రామ‌ర‌మైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సంరంభం అని అర్థం. దాదాపు రెండు వంద‌ల ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన బ్రిటిష్ వ‌ల‌స పాల‌కుల‌కు వ్యతిరేకంగా స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం సాగిన ఉద్యమమే జాతీయోధ్యమం.. స్వాతంత్ర్యోద్యమం.. భారత జాతి దాస్య శృంఖలాల నుంచి విముక్తి కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యాగం చేసిన ఫలితమే 1947లో దేశానికి స్వరాజ్యం సిద్ధించింది.
 
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో ప్రజలందరూ భాగం కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో సర్పంచులు కార్యక్రమం నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ జాతీయగీతం పాడి రాష్ట్ర గీత్ వెబ్ సైట్ లో ఉంచాలని సూచించారు.
 
అయితే ఈ మహోత్సవంలో భాగంగా వేడుకలను ప్రారంభించే 16 చరిత్రాత్మక ప్రాంతాలను పురావస్తు శాఖ గుర్తించింది. ఢిల్లీలోని ఖిలా రాయ్ పిథోరా వద్ద ప్రారంభమవుతాయి. మిగతా 15 ప్రాంతాలైన గ్వాలియర్ కోట, ఢిల్లీలోని హుమయూన్ సమాధి, ఫతేపూర్ సిక్రీ, హైదరాబాద్‌లోని గోల్కొండ కోట, ఐజ్వాల్‌లోని భువనేశ్వరి ఆలయం, ముంబయిలోని అగాఖాన్ ప్యాలెస్, ఒడిశాలోని కొణార్క్ ఆలయం, లక్నోలోని హిమాచల్‌ ప్రదేశ్‌ రెసిడెన్సీ బిల్డింగ్ కాంగ్రా కోట, ఝాన్సీ కోట, తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పూర్వీకుల నివాసం, కర్ణాటకలోని చిత్రదుర్గ కోట, వారణాసిలోని మహల్ ఘాట్, అమరావతి, జైపూర్ ప్యాలెస్ వద్ద ఈ వేడుకలు నిర్వహిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైతీలో భారీ భూకంపం.. 304 మంది దుర్మరణం