Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైతీలో భారీ భూకంపం.. 304 మంది దుర్మరణం

Advertiesment
హైతీలో భారీ భూకంపం.. 304 మంది దుర్మరణం
, ఆదివారం, 15 ఆగస్టు 2021 (10:46 IST)
హైతీలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి 304 మందికిపై ప్రజలు మృత్యువాతపడినట్టు తెలుస్తోంది. శనివారం రాత్రి సంభవించి ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా వుంది. ఈ ప్రకంపనల ధాటికి ఇప్పటివరకు 304 మంది మృత్యువాతపడ్డారు. 
 
గత 2010లో సంఘటన నుంచి నుంచి కోలుకుంటున్న ఆ దేశంపై ప్రకృతి మరోసారి కన్నెర్ర చేసింది. తెల్లవారు జామున ఒక్కసారిగా వచ్చిన ప్రకంపనలతో జనం బయటకు పరుగులు పెట్టారు. అత్యంత జనసాంద్రత కలిగిన రాజధాని పోర్ట్-ఓ-ప్రిన్స్ నగరానికి 160 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైంది. 
 
భూకంపం తీవ్రతకు భవనాలు నేలమట్టమవగా.. పెద్ద ఎత్తున జనం మృత్యువాతపడగా.. భారీగా తీవ్ర గాయాలకు గురయ్యారు. భూకంపం హైతీ నైరుతి ద్వీపకల్పంలోని పాఠశాలలు, నివాసాలకు నష్టం కలిగించింది. ఇప్పటివరకు 304 మంది మృతి చెందినట్లు ఆ దేశ పౌర సంరక్షణ సంస్థ తెలిపింది. 
 
భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లోని ఆసుపత్రులు నిండిపోయాయి. పెస్టెల్, కోరెయిల్లెస్, రోసాక్స్ మున్సిపాలిటీల్లో కనీసం మూడు పూర్తిగా నిండినట్లు పౌర రక్షణ సంస్థ అధిపతి జెర్రీ చాండ్లర్ తెలిపారు. ప్రకృతి విపత్తు నేపథ్యంలో హైతీ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సైతం తక్షణ సహాయం అందించేందుకు ఆదేశాలు ఇచ్చారు. 
 
అనంతరం నెల రోజుల పాటు దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఎవరూ భయపడొద్దని సూచించారు. భూకంపం సంభవించిన అనంతరం యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే సునామీ హెచ్చరిక జారీ చేసింది. హైతీ తీరం నుంచి మూడు మీటర్లు (10 అడుగులు) అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించి, ఆ తర్వాత ఉపసంహరించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎర్రకోటపై నుంచి ప్రధాని మోడీ ప్రసంగం : ఇకపై బాలికలకు కూడా ప్రవేశం