Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాదములను చిరుతిండిగా తీసుకుంటున్న భారతీయ యువత: వెల్లడించిన అధ్యయనం

బాదములను చిరుతిండిగా తీసుకుంటున్న భారతీయ యువత: వెల్లడించిన అధ్యయనం
, శుక్రవారం, 16 జులై 2021 (18:50 IST)
మనచుట్టూ ఉన్న ప్రపంచం అత్యంతవేగంగా మారుతుంది. సమాచారం తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా గణనీయంగా పెరుగుతుంది. భారతదేశ వ్యాప్తంగా వినియోగదారులు తమ జీవనశైలి మరియు ఆహారప్రాధాన్యతలను చూసే తీరు కూడా మారింది, ఈ మార్పు అనేది 18-35 సంవత్సరాల నడుమ యువ భారతీయులలో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. తమ జీవనశైలి పట్ల ఈ యువత అత్యంత అప్రమత్తతో వ్యవహరిస్తుండటంతో పాటుగా తమ జీవనశైలి మెరుగుపరుచుకునేందుకు తగిన జాగ్రత్తలనూ అదే రీతిలో తీసుకుంటున్నారు.
 
ఇటీవలి కాలంలో అంటే 05-25మార్చి 2021 మధ్యకాలంలో రీసెర్చ్‌ కన్సల్టింగ్‌ సంస్థ ఇప్సోసిస్‌ ఇండియా నిర్వహించిన అధ్యయనంలో 78% మంది స్పందనదారులు మారుతున్న జీవనశైలి కారణంగా ఆరోగ్యవంతమైన స్నాకింగ్‌ తప్పనిసరి (చాలా ముఖ్యం (58%) మరియు వాడటం ముఖ్యం (20%) అని అంటున్నారు. ఇప్సోసిస్‌ ఇండియా నిర్వహించిన ఈ పరిమాణాత్మక అధ్యయనంలో మారుతున్న స్నాకింగ్‌ అలవాట్లను గుర్తించడంతో పాటుగా మారుతున్న ఆధునిక జీవిత చక్రంలో భారతీయ నగర ప్రాధాన్యతలనూ తెలుసుకున్నారు.
 
మొత్తంమ్మీద ఈ అధ్యయన ఫలితాలు వెల్లడించే దాని ప్రకారం భారతదేశంలో అధికశాతం మంది యవత తమ ఆరోగ్యం పట్ల అమితంగా ఆందోళన చెందుతున్నారు. అదే వారు తమ స్నాకింగ్‌ అలవాట్లను మార్చుకునేందుకు సైతం తోడ్పడుతుంది. ఈ అధ్యయనంలో భారతదేశ వ్యాప్తంగా యువత ఏవిధంగా అత్యధిక కేలరీలు కలిగిన జంక్‌ ఆహారంకు బదులుగా ఆరోగ్యవంతమైన, పోషకాలతో కూడిన బాదములు, పండ్లుతో కూడిన స్నాకింగ్‌ కోరుకుంటుందో కూడా తెలిపారు.
 
మొత్తంమ్మీద 4,148 స్పందనదారులను 18-35 సంవత్సరాల నడుమ తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఢిల్లీ, లక్నో, లుథియానా, జైపూర్‌, ముంబై, అహ్మదాబాద్‌, కోల్‌కతా, భుబనేశ్వర్‌, చెన్నై, బెంగళూరు, కోయంబత్తూర్‌, హైదరాబాద్‌ లాంటి 12 నగరాలలోని యువతీయువకులను ఎంచుకున్నారు.
 
భారతీయ యువత నడుమ అత్యున్నత ప్రాధాన్యతా ఎంపికగా బాదములు నిలిచాయి. దాదాపు 64% మంది స్పందనదారులు బాదములు అందించే ఆరోగ్య ప్రయోజనాల కారణంగా వాటికి ప్రాధాన్యతనిస్తున్నామని తెలుపుతున్నారు. ఈ స్పందనదారులలో అధికశాతం మందికి స్నాకింగ్‌ ప్రాధాన్యతలలో  రుచి మరియు ఆరోగ్యం/పోషకాలు నిలుస్తున్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, జెడ్‌ జెడ్‌ మరియు మిల్లీనియల్స్‌ తాము బాదములను పోషకాలు (41%), ఆరోగ్యం (39%), ప్రోటీన్‌ అధికంగా ఉండటం(38%) మరియు విటమిన్‌లు అధికంగా ఉండటం (36%) కారణంగా ఎంచుకుంటున్నామంటున్నారు. అధికశాతం మంది స్పందన దారులు (84%) మంది తరచుగా బాదములు తినడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగవుతుందని నమ్ముతున్నారు.  బాదములతో పాటుగా దాదాపు 50% మంది స్పందనదారులు తాము ఆకు కూరలు, కూరగాయలు, తాజా పండ్లు , జ్యూస్‌లను సైతం తమ స్నాకింగ్‌ ప్రక్రియలో భాగం చేసుకున్నామని వెల్లడించారు.
 
ఆరోగ్యవంతమైన బాదములు లాంటి స్నాక్స్‌ దిశగా యువత పయనించడమన్నది తమ పోషకాహార అవసరాల కోసం యువత పడుతున్న ఆందోళనను సైతం వెల్లడిస్తుంది. దాదాపు 66% మంది యువత తాము దీనికోసమే ఆందోళన చెందుతున్నామంటున్నారు. బరువు పెరగడం, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఈ ఆందోళనలకు కారణంగా నిలుస్తుంది. ఉత్తరాది నగరాలు (ఢిల్లీ, లక్నో, లుథియానా మరియు జైపూర్‌)లో అధిక శాతం మంది పోషకాల ఆవశ్యకత పట్ల ఎక్కువ ఆందోళన  చెందుతున్నారు. దాదాపు  మూడోవంతు యువత ఇదే విషయం వెల్లడిస్తుంది. అంతేకాదు, దాదాపు 51%మంది తమ ఆహారంలో దాగి ఉన్న పదార్థాలు, పోషకాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు వెల్లడించారు. వీరిలోనూ 26-35 సంవత్సరాలలోని మహిళలు ఎక్కువగా ఉన్నారు. అదనంగా, కనుగొనబడిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే అధికశాతం స్పందనదారులు (61%) ఇంటి వంటకు ప్రాధాన్యతనిస్తున్నారు.
 
గత సంవత్సరం మార్చి నుంచి అధిక శాతం మంది యువ ప్రొఫెషనల్స్‌ఇంటి నుంచి పనిచేస్తున్నారు. చాలామంది ఈ నూతన సాధారణతను స్వీకరించడానికీ  ఇబ్బంది పడుతున్నారు. యువ వినియోగదారులు తమ జీవనశైలిని పునః సమీక్షించుకోవడంతో పాటుగా ఆరోగ్యవంతమైన ఆహార అలవాట్లు అయినటువంటి ఆలోచనాత్మకంగా స్నాకింగ్‌ తీసుకోవడం, ప్రతిరోజూ వ్యాయామాలు చేయడం, పలు స్ర్కీన్‌ల నుంచి విశ్రాంతి తీసుకోవాలనీ కోరుకుంటున్నారు.
 
ఈ ఫలితాలను గురించి న్యూట్రిషన్‌- వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ, ‘‘గత సంవత్సరంన్నర కాలం మనందరికీ అత్యంత సవాల్‌తో కూడిన కాలంగా మారడంతో పాటుగా  ఆరోగ్య ప్రాధాన్యతలనూ గణనీయంగా మార్చాయి. ఈ అధ్యయన ఫలితాలు ఆకట్టుకునే రీతిలో ఉన్నాయి. యువత తమ ఆర్యోగం, జీవనశైలి మార్చుకోవడం పట్ల చూపుతున్న ఆసక్తి అద్భుతం. పోషకాలతో కూడిన బాదములను ప్రతి రోజూ తినడం వల్ల తమ బరువును నిర్వహించగలరు.అదే సమయంలో తమ డైట్‌కు మరిన్ని పోషకాలనూ జోడించగలరు. అందువల్ల ప్రతి రోజూ ఓ గుప్పెడు బాదములు తినడాన్ని అలవాటుగా మార్చుకోండి. ఈ ఆరోగ్య ప్రయోజనాలు వైవిధ్యంగా లభిస్తాయి’’ అని అన్నారు.
 
ఈ అధ్యయనంలో కనుగొనబడిన మరో అంశం ఏమిటంటే, దాదాపు పావు వంతు స్పందనదారులు తమ స్నాకింగ్‌ ఫ్రీక్వెన్సీ మహమ్మారి కాలంలో పెరిగిందని చెబుతున్నారు. అంతేకాదు మూడింట ఒక వంతు మంది ప్రధానమైన మీల్స్‌ స్థానాన్ని  స్నాకింగ్‌ భర్తీ చేసిందంటున్నారు. దాదాపు 50% మంది రోజుకోమారు స్నాక్స్‌ తీసుకుంటామంటుంటే, 41% మంది రెండు సార్లు తాము రోజూ స్నాక్‌ తీసుకుంటామంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొట్ట తగ్గేందుకు ఉత్తరేణి రసాన్ని నువ్వుల నూనెలో కలిపి...