Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనాంతరం నీరు తాగకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా..?

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (14:15 IST)
సాధారణంగా చాలామందికి చలికాలంలో నీళ్లు అంతగా తాగాలనిపించదు. కానీ, వైద్యులేమో ఇలా చేయడం మంచిది కాదంటున్నారు. నీళ్లు సరిగ్గా తాగకపోతే అనారోగ్యాల పాలవుతారని చెప్తున్నారు. కాస్త నీరసంగా అనిపిస్తే చాలు.. కాఫీలో లేదా టీ తాగుతుంటారు. ఈ రెండింటిని తీసుకోవడం కంటే గ్లాస్ నీటిని తాగడం మంచిదంటున్నారు వైద్యులు. ఒకవేళ నీటిని తీసుకోకపోతే ఏర్పడే సమస్యలేంటో చూద్దాం...
 
1. మనసంతా ఆందోళనగా, ఏదో భయం భయంగా ఉంటుంది. ఈ భయంతో తలనొప్పి తీవ్రంగా మారుతుంది. దాంతో శరీరమంతా నీరసం, నొప్పులకు గురవుతుంది. ఈ సమస్యలు ఎందుకు వస్తాయంటే.. శరీరంలో నీరు లేకపోవడమే ఇందుకు కారణం. కనుక క్రమంగా రోజూ నీరు తాగండి ఆరోగ్యవంతమైన జీవితాన్ని సొంతం చేసుకోండి.
 
2. కొందరైతే కాస్త నీరసంగా, ఒత్తిడిగా అనిపిస్తే చాలు.. వెంటనే కిచెన్‌కి వెళ్లి కాఫీలో లేదో టీ తీసుకుంటారు. ఇవి ఆరోగ్యానికి మంచివే. కానీ, మన శరీరంలో ఇలాంటి సమస్యలు దేని కారణంగా వచ్చాయో.. దాంతోనే ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులనైన ఎదుర్కోవచ్చును.
 
3. శరీరం డిహైడ్రేషన్‌కి గురైనప్పుడు కడుపులో ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయం వెంటనే భోజనం చేయకుండా.. గ్లాస్ చల్లని నీరు తీసుకుంటే ఫలితం ఉంటుంది. కాసేపటి తరువాత మీకే అర్థమవుతుంది. ఆ ఆకలి నిజమైనదో కాదో..
 
4. చాలామంది భోజనం చేశాక నీళ్లు అంతగా తీసుకోరు. ఇలా చేస్తే తిన్న ఆహారం జీర్ణం కాదు. దీని ఫలితంగా మలబద్ధకం ఎదురుకావొచ్చు. ఈ సమస్య పెద్దదై కిడ్నీలో రాళ్లు ఏర్పడేలా చేస్తుంది. కనుక భోజనాంతరం తప్పక నీరు అధిక మోతాదులో తీసుకోండి.. ఎలాంటి సమస్యలు దరిచేరవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments