గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో పోషకాహారం తీసుకోవాలి. మొదటి మూడు నెలల్లో గర్భం ధరించిన మహిళలు ప్రోటీన్ మరియు క్యాల్షియం వున్న ఆహారాలను ప్రధానంగా తీసుకోవాలి. ఇవి గర్భంలోని బిడ్డ వేగంగా పెరగడానికి సహాయపడుతాయి. మొదటి మూడు మాసాల్లో తీసుకొనే ఆహారంలో ప్రోటీనులు అధికంగా ఉండేలా చూసుకోవాలి.
పాలకూరలో క్యాల్షియం మరియు ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. తల్లి నుండి రక్తం బిడ్డకు ప్రసరిస్తుంది కాబట్టి, ఆకు కూరలను తినడం వల్ల తల్లికి సరిపడా రక్తం ఉత్పత్తి అవుతుంది.
తృణ ధాన్యాలు తీసుకోవాలి. ఆరెంజ్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది తల్లిలో ఏర్పడే ఇన్ఫెక్షన్లతో పోరాడగలిగేందుకు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి సహాయపడుతుంది.
సిట్రస్ పండ్లలో విటమిన్ సి మరియు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. అలసట నుండి తక్షణ ఉపశమనం పొందడానికి ఆరోగ్యకరమైన పానీయాలు అంటే ఆరెంజ్ జ్యూస్ వంటివి సేవించాలి.
బాదంలో విటమిన్ ఇ మరియు ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ మరియు ప్రోటీనులు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గర్భిణీ స్త్రీలకు చాలా బాగా సహాయపడి గర్భిణీ స్త్రీ మరికొన్ని అదనపు ప్రోటీనులను అందజేస్తుంది.
బాదాంలో యాంటిఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉండి, బాడీ మెటబాలిజంను పెంచుతుంది. ఇక పనీర్‌లో పుష్కలమైన క్యాల్షియం ఉంటుందంటారు. ఇది శిశువు ఎముకలకు మరియు పెరుగుదలకు బాగా సహాయపడుతాయి.