Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భక్తికి, ప్రశాంతతకు ఆనవాలుగా నిలవాల్సిన ఆలయం మృత్యుకూపం

Advertiesment
12 persons dead
, శనివారం, 15 డిశెంబరు 2018 (10:27 IST)
శాస్త్రోక్తంగా జరగాల్సిన గోపురం ప్రతిష్ఠ మసక మారింది. 2 గ్రూపుల మధ్య తలెత్తిన విభేదాలు 12 మందిని పొట్టన బెట్టుకున్నాయి. మైసూరు సమీపంలోని చమరాజనగర్ జిల్లా సులివాడ గ్రామంలో విషపూరిత ప్రసాదం సేవించడంతో పల్లె స్మశానంలా మారింది. మైసూరు సహా పలు ప్రాంతాల్లో సుమారు 80 మంది చికిత్స పొందుతున్నారు.
 
సమాచారం తెలుసుకున్న సీఎం కుమారస్వామి హుటాహుటిన మైసూరు చేరుకుని అధికారులతో పరిస్థితిపై సమీక్షించారు. మృతుల కుటుంబీలకు 5 లక్షల పరిహారం ప్రకటించారు. 
వివరాల్లోకి వెళితే... చమరాజనగరా జిల్లా కొల్లేగ్ల తాలూకలో గోపురం కోసం తలెత్తిన గ్రూపు తగాదాలు ఆ పల్లెను స్మశానంలా తయారు చేశాయి. 
 
భక్తితో ప్రసాదం సేవించిన 12 మంది అమాయకులు మృతి చెందగా మరో 60 మంది ఆసుపత్రిలో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నారు. సులువాడి గ్రామంలో ఉదయం 10.30 గంటలకు కీచుగుతి మారం ఆలయం గోపుర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇదే సందర్భంగా ఆలయంలో ప్రత్యక పూజలు కొనసాగాయి.
 
మధ్యాహ్నం 1 గంటకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. భక్తి భావనతో ఆరగించిన వారికి కేవలం ఒక గంట వ్యవధిలోనే ఆరోగ్యంలో అలజడి చెలరేగింది. పరిస్థితి విషమంగా మారింది. దాంతో బాధితులను ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడే పడవేసిన ప్రసాదాన్ని తిన్న కాకులు కూడా మరణించాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్రాస్ ఐఐటీలో అంటరానితనం...