అమీర్ పేటలో కనకదుర్గ, సత్యసాయి బాబాకు కేసీఆర్ పూజలు...

బుధవారం, 12 డిశెంబరు 2018 (13:43 IST)
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఈ రోజు పలు మొక్కులను చెల్లించుకున్నది. ముఖ్యమంత్రి సతీమణి శ్రీమతి శోభతో పాటు, మంత్రి కేటీ రామారావు సతీమణి శైలిమ మరియు ఇతర కుటుంబ సభ్యులు ఈ రోజు అమీర్‌పేటలోని భగవాన్  సత్యసాయి బాబా ప్రశాంతి నిలయం మరియు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. 
 
తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీ పట్ల కేసీఆర్ గారి నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేసిన నేపథ్యంలో భవిష్యత్తులో అమ్మవారి ఆశీస్సులతో ముందుకు వెళ్లేలా మొక్కుకున్నారు. మొక్కులు చెల్లించుకునేందుకు దేవాలయానికి వచ్చిన కెసిఆర్ కుటుంబ సభ్యులకు దేవాలయ ప్రతినిధులు, అయ్యవార్లు శాస్త్రోక్తంగా స్వాగతం పలికి పూజలు నిర్వహించారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం బక్కోడిని కొట్టేందుకు సైంధవుడిలా వచ్చారు.. చంద్రబాబుపై పోసాని కృష్ణమురళి