Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిని నగ్నంగా వీడియో తీసిన వ్యక్తి అంతలోనే శవమయ్యాడు... ఎలా?

ఠాగూర్
ఆదివారం, 2 ఫిబ్రవరి 2025 (10:23 IST)
విశాఖపట్టణంలోని ఫార్మాసిటీలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిని నగ్నంగా వీడియో తీసిన ఓ యువకుడు అంతలోనే శవమయ్యాడు. యువకుడిని గదిలో నిర్బంధించి అతని తల్లిదండ్రులకు కబురు పెట్టారు. తల్లిదండ్రులు వస్తే తన పరువు పోతుందని భావించిన ఆ యువకుడు.. కేబుల్ వైరుతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనలో ఐదుగురుని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. 
 
విజయనగరం జిల్లా ఫూల్‌బాగ్ కాలనీకి చెందిన గొందేటి భాస్కర రావు (30) అనే వ్యక్తి విశాఖ ఫార్మాసిటీలోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈయన గాజువాక సమీపంలోని శ్రీరాంనగర్‌లో ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు. శనివారం ఉదయం పక్కింటి అమ్మాయి స్నానం చేస్తుండగా వీడియో తీశాడు. ఈ విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు భాస్కర రావుతో గొడవకు దిగి, వీడియోను డిలీట్ చేయించారు. 
 
అయితే, అంతటితో వారు ఆగకుండా భాస్కర రావును ఇంట్లోనే బంధించి, విజయనగరంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చిన తర్వాత గదిలోకి వెళ్లి చూసి హతాశులయ్యారు. సీలింగ్ ఫ్యానుకు కేబుల్ వైరుతో ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ బిడ్డ ముఖంపై గాయాలు కూడా ఉన్నాయని, తమ కుమారుడుని కొట్టి చంపేశారని కుటుంబ సభ్యులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments