అమీర్ ఖాన్. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈయనకు వున్న క్రేజ్ వేరే చెప్పక్కర్లేదు. అదేసమయంలో తన వ్యక్తిగత జీవితంలోనూ అంతే చర్చనీయాంశమైన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తుంటాడు అమీర్ ఖాన్.
ఇక అసలు విషయానికి వస్తే... బెంగళూరుకి చెందిన ఓ అందమైన యువతి ప్రేమలో పడ్డాడట 60 ఏళ్ల అమీర్ ఖాన్. ఆమెను తన కుటుంబ సభ్యులందరికీ పరిచయం కూడా చేసాడట. ఆమె ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన అమీర్ ఖాన్, ఆమెను వదిలి వుండలేకపోతున్నాడట. అందుకే సాధ్యమైనంత త్వరగా ఆమెను వివాహం చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు బాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు.
కాగా అమీర్ ఇప్పటికే ఇదర్ని పెళ్లి చేసుకుని వారికి విడాకులు ఇచ్చేసాడు. మొదటి భార్యతో ఇద్దరు పిల్లలు, రెండో భార్యతో ఒక సంతానాన్ని కన్నాడు. మరిప్పుడు అమీర్ మనసు మూడో పెళ్లిపై మళ్లింది.