Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తండేల్‌ ఫుటేజ్ కు అనుమతినిచ్చిన బన్సూరి స్వరాజ్‌కు ధన్యవాదాలు తెలిపిన బన్నీ వాసు

Advertiesment
Bunny Vasu,  Bansuri Swaraj

డీవీ

, శుక్రవారం, 31 జనవరి 2025 (17:44 IST)
Bunny Vasu, Bansuri Swaraj
భారత విదేశాంగ మంత్రిగా సుష్మా స్వరాజ్ లెగసీ చిరస్మరణీయమైనది. విదేశాల్లోని భారతీయుల పక్షాన గొంతుకగా, వారు చంద్రునిపై చిక్కుకుపోయినా ఇంటికి తీసుకువస్తానని ఆమె చెప్పేవారు. ఆమె తన కృషి ద్వారా పాకిస్తాన్ జైళ్ల నుండి 22 మంది మత్స్యకారులను విడుదల చేయడం గర్వించదగ్గ విజయాలలో ఒకటి. 
 
సుష్మా స్వరాజ్ అనంతరం, ఆమె కుమార్తె బన్సూరి స్వరాజ్ తన తల్లి లక్ష్యాన్ని కొనసాగిస్తూ, మత్స్యకారులు సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చేలా చూసుకోవడానికి తాను బాధ్యతగా తీసుకున్నారు.
 
ఇప్పుడు, ఈ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ తండేల్, సుష్మా స్వరాజ్, ఆమె కుటుంబం చేసిన ప్రయత్నాలను హైలైట్ చేస్తుంది. ఈ చిత్ర నిర్మాత బన్నీ వాసు, తన తల్లి పేరు, ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్‌ల నుండి వచ్చిన రియల్ ఫుటేజ్‌లను ఉపయోగించడానికి అనుమతి కోసం బన్సూరి స్వరాజ్‌ను సంప్రదించగా, కుటుంబం వారికి అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) మంజూరు చేసింది.
 
బన్నీ వాసు తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ “2017, 2018లో పాకిస్తాన్ జైళ్లలో చిక్కుకున్న మత్స్యకారులను తిరిగి తీసుకురావడంలో మీ మాతృమూర్తి, మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి @SushmaSwaraj గారు చేసిన అద్భుతమైన పనిని చూపించే అవకాశం మాకు ఇచ్చినందుకు @BansuriSwaraj గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు  రాజు, సత్య యొక్క నిజమైన కథలోని పేర్లను పంచుకోవడానికి అనుమతి ఇవ్వడంలో మీ మద్దతు ధన్యవాదాలు” అన్నారు
 
చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగ చైతన్య, సాయి పల్లవి కథకు ప్రాణం పోశారు, ఈ చిత్రంలో అద్భుతమైన తారాగణం వుంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. బన్నీ వాసు నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం మరో హైలైట్, అన్ని పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి.  తమిళ ట్రైలర్‌కు ఇప్పటికే అద్భుతమైన స్పందన లభించగా, హిందీ ట్రైలర్‌ను ఈరోజు ముంబైలో అమీర్ ఖాన్ లాంచ్ చేయనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్వేతబసు ప్రసాద్... తాజా ఫోటో షూట్... ఎరుపు రంగు డ్రెస్సుతో అదిరింది