డిజిటల్ అరెస్టుకు భయపడి... గుండెపోటుతో రిడైర్డ్ డాక్టర్ మృతి

ఠాగూర్
గురువారం, 18 సెప్టెంబరు 2025 (10:39 IST)
హైదరాబాద్ నగరంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ రిటైర్డ్ మహిళా డాక్టర్‌కు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. డిజిటల్ అరెస్టుకు భయపడి ఆమెకు ఛాతినొప్పి రావడంతో తుదిశ్వాస విడిచారు. చాలామంది సైబర్ నేరాగాళ్ళ వలలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. తాజగా ఈ మహిళా వైద్యురాలు కూడా సైబర్ నేరగాళ్ళ బారినపడటంతో గుండెపోటుకు రావడంతో ప్రాణాలు కోల్పోయి. 
 
డిజిటల్ అరెస్టు పేరుతో మూడు రోజుల పాటు సైబర్ నేరగాళ్లు వేధించడంతో హైదరాబాద్‌కు చెందిన 76 ఏళ్ల రిటైర్డ్ వైద్యురాలు గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. 
 
హైదరాబాద్ నగరానికి చెందిన ఈ సీనియర్ వైద్యురాలు గతంలో చీఫ్ సీనియర్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేశారు. సెప్టెంబరు 5వ తేదీన, సైబర్ నేరగాళ్లు ఆమెను సంప్రదించి, బెంగళూరు పోలీసులుగా నమ్మించారు. ఆమె ఆధార్ కార్డును మానవ అక్రమ రవాణా కేసులో వినియోగించారని బెదిరించారు. 
 
సెప్టెంబరు 5 నుంచి 8 వరకు ఆమెకు ప్రతిరోజూ వీడియో కాల్స్ చేస్తూ, సుప్రీంకోర్టు, ఈడీ, ఆర్బీఐ, కర్ణాటక పోలీస్ విభాగాల పేరుతో నకిలీ అరెస్టు వారెంట్లు చూపించి భయపెట్టారు. డిజిటల్ అరెస్టు చేశామని చెప్పి, బ్యాంకు వివరాలు అడిగి, దర్యాప్తు అవసరమని ఆమెను మానసికంగా వేధించారు.
 
ఈ క్రమంలో ఆమె భయంతో తన పెన్షన్ ఖాతా నుంచి రూ.6.6 లక్షలను విడతల వారీగా నేరగాళ్లకు బదిలీ చేశారు. సెప్టెంబరు 8న తెల్లవారుజామున తీవ్ర ఆందోళనకు గురైన ఆమెకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.
 
ఆమె మరణించిన తర్వాత కూడా సైబర్ నేరగాళ్లు ఆమె ఫోను సందేశాలు పంపుతూనే ఉన్నారని పోలీసులు తెలిపారు. ఫోనులోని కాల్ లాగ్స్, మెసేజ్లను పరిశీలించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments