Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోడపై విద్యార్థిని ఫోటో చూస్తూ హస్తప్రయోగం చేసిన ఇంజినీరింగ్ విద్యార్థి, జైలు శిక్ష

ఐవీఆర్
బుధవారం, 25 జూన్ 2025 (16:31 IST)
ఇంగ్లాండు లోని నార్తుంబ్రియా విశ్వవిద్యాలయంలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న ఒక భారతీయ విద్యార్థి తన తోటి అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని గదిలోకి చొరబడి గోడపై ఆమె ఫోటోను చూస్తూ హస్త ప్రయోగం చేసాడు. ఆ విషయం బైటపడటంతో అతడిని యూనివర్శిటీ నుంచి సస్పెండ్ చేసి జైలు శిక్షను విధించారు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. 18 ఏళ్ల ఉద్కర్ష్ యాదవ్ ఇంగ్లాండులోని నార్తుంబ్రియా విశ్వవిద్యాలయంలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అతడు జిమ్ కీకార్డ్‌ను ఉపయోగించి విద్యార్థునుల గదుల్లోకి అనధికారంగా చొరబడుతుండేవాడు. అందులో మొదటి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్న విద్యార్థిని కూడా ఉంది. ఆ యువతి క్రిస్మస్ సెలవుల తర్వాత తన విశ్వవిద్యాలయ వసతి గృహానికి తిరిగి వచ్చి తన బెడ్ కవర్, టెడ్డీ బేర్‌లపై జిగురుగా ఎండిపోయిన వైట్ మెటీరియల్ వున్నట్లు కనుగొన్నది. ఈ విషయం కాస్తా పెద్దదై పోలీసుల వరకూ చేరింది. దీనితో ఆ యువతి గదిలోకి యాదవ్ అక్రమంగా చొరబడినట్లు తేల్చిన పోలీసులు అతడి వద్ద విచారణ చేపట్టారు.
 
ఆ విచారణలో యాదవ్, విద్యార్థిని పడుకునే మంచం, బొమ్మలపై స్ఖలనం చేసినట్లు ఒప్పుకున్నాడు. గోడపై విద్యార్థిని ఫోటో చూస్తూ హస్తప్రయోగం చేసిన క్రమంలో ఈ పని జరిగినట్లు పోలీసులకు చెప్పాడు. సంఘటన స్థలం నుండి సేకరించిన డిఎన్ఎ ఆధారాలు అతడివేనని నిర్థారణ అయ్యింది. అతడి చర్య లైంగిక స్వభావంతో కూడుకున్నది కావడంతో విద్యార్థిని ఆ గదిని వదిలేసి బయటకు వెళ్లి తన స్నేహితురాళ్లతో బస చేసింది.
 
కాగా యాదవ్‌కు ముందస్తు నేర చరిత్ర లేదు కనుక అతడికి 14 నెలల జైలు శిక్ష విధించింది కోర్టు. రెండేళ్లపాటు సస్పెండ్ చేసారు. అతను 200 గంటల పాటు జీతం లేని పనిని చేయాలని, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలనీ, దెబ్బతిన్న బొమ్మలు, పరుపులకు పరిహారంగా రూ. 14,000 చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానిస్తూ... నేను ఇంతకు ముందు ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. ఇది ఒక అసహ్యకరమైన పని అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం