3 వేల కార్లతో సముద్రంలో మునిగిపోయిన కార్గో నౌక!!

ఠాగూర్
బుధవారం, 25 జూన్ 2025 (16:27 IST)
పసిఫిక్ మహా సముద్రంలో కార్గో నౌక ఒకటి మునిగిపోయింది. మూడు వేల కార్లతో వెళుతున్న ఈ నౌకలో వారం రోజుల క్రితమే అగ్నిప్రమాదం సంభవించింది. ఈ కారణంగానే భారీ నౌక నీటిలో మునిగిపోయివుండొచ్చని భావిస్తున్నారు. 
 
ఈ రవాణా నౌకలో మొత్తం 3 వేల కార్లు ఉండగా, అందులో 800 ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. అలస్కాలోని అలూటియన్ దీవుల వద్ద తాజాగా ఈ నౌక మునిగిపోయిందని లండన్‌కు చెందిన ఓ నౌక నిర్వహణ సంస్థ జోడియాక్ మారిటైమ్ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
అయితే, ఈ ఘటన తర్వాత అంత పెద్దగా కాలుష్యం వెలువడలేదని, యూఎస్ కోర్ట్‌గార్డ్ ప్రతినిధి తెలిపారు. కాలుష్య నియంత్రణ పరికరాలు కలిగిన రెండు సాల్వేజ్ టగ్‌లను అక్కడ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 
 
జూన్ 3 తేదీన ఈ రవాణా నౌకలో అగ్నిప్రమాదం జరిగిందని తమకు సమాచారం వచ్చిందని యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి తెలిపారు. ప్రమాదం సమయంలో నౌకలో 22 మంది సిబ్బంది ఉండగా, వారందరూ లైఫ్‌బోట్ ద్వారా బయటపడి ప్రాణాలు కాపాడుకున్నట్టు తెలిపారు. 
 
ఆ సమంయలో  సమీపంలోని మర్చంట్ మెరైన్ అనే మరో నౌక వారిని రక్షించినట్టు తెలిపారు. ఓడకు వెనుక భాగంలో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు లోడింగ్ చేసివుండటంతో పెద్దమొత్తంలో పొగలు కనిపించాయని ప్రమాద సమయంలో కోస్ట్ గార్డు అధికారులు, నౌకా సంస్థ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments