సింగిల్ ఉమెన్ అని ఫోటో పెట్టింది, కనెక్టైన యువకుడు దగ్గరికెళితే యాసిడ్ పోసింది, ఎందుకు?

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (20:28 IST)
పెళ్ళయ్యింది.. ఒక కొడుకు ఉన్నాడు. భర్త బాగా చూసుకుంటాడు. అయితే ఆమెకు ఫేస్ బుక్ అంటే బాగా పిచ్చి. ప్రతిరోజు ఏదో ఒక ఫోటో తీసుకుని పోస్ట్ చేయడం అలవాటు. సింగిల్ ఉమెన్ అంటూ స్టాటస్ పెట్టి యువకులతో బాగా చాటింగ్ చేసేది. అదే ఆమె జీవితాన్ని నాశనం చేస్తుందని ఊహించలేదు.

 
కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లాలోని ఆదిమళి గ్రామానికి చెందిన షీబా గృహిణి. భర్త, కొడుకు ఉన్నారు. భర్త మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. బాగా సంపాదిస్తున్నాడు. అన్యోన్యంగా వెళుతున్న కుటుంబం. అయితే కొడుకు స్కూలుకు వెళ్ళడం.. భర్త ఆఫీసుకి వెళ్ళడంతో ఆమె ఒంటరితనంగా భావించేది.

 
ఫేస్ బుక్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. అయితే తన ఫ్రొఫైల్లో సింగిల్ అని ఫోటోలను పెట్టేది. పెళ్ళయ్యింది అంటే స్నేహితులు దొరకరని అలా ఫోటోలను పోస్ట్ చేసేది. ఇలా ప్రతిరోజు ఏదో ఒక ఫోటోను పెడుతూ యువకులను దగ్గరైంది. అలా అరుణ్ కుమార్ అనే తమిళనాడుకు చెందిన వ్యక్తి కనెక్టయ్యాడు.

 
రెండు నెలల పాటు ఫోన్ లోనే వీరి ప్రేమ వ్యవహారం నడిచింది. ఎక్కడా తనకు పెళ్ళయ్యిందన్న విషయాన్ని బయటకు చెప్పలేదు షీబా. జాగ్రత్త పడేది. ఉన్నట్లుండి కేరళకు షీబా ఇంటికి వచ్చిన అరుణ్‌కు అసలు విషయం తెలిసింది. ఆమెను నిలదీశాడు. 

 
పెళ్ళయితే ఏమి? నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నానని చెప్పింది. నిన్ను పెళ్ళి చేసుకుంటానంది. నాకు నువ్వు వద్దంటూ షీబా ఇంటికి సమీపంలోని తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు అరుణ్. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన షీబా యాసిడ్ బాటిల్‌తో అరుణ్ పైన దాడికి దిగింది.

 
ముఖం కాలిపోవడంతో ఆసుపత్రి పాలయ్యాడు అరుణ్. నిందితురాల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంత జరుగుతున్నా తనకు ఏ విషయం తెలియదంటూ భర్త పోలీసుల ముందు బిక్కముఖం వేశాడట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments