Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్తను కాదని తనకన్నా 8 ఏళ్లు తక్కువున్న యువకుడితో ఎఫైర్, భర్తకి తెలియడంతో...

Advertiesment
భర్తను కాదని తనకన్నా 8 ఏళ్లు తక్కువున్న యువకుడితో ఎఫైర్, భర్తకి తెలియడంతో...
, సోమవారం, 1 నవంబరు 2021 (16:15 IST)
పెళ్ళయ్యింది. ముగ్గురు పిల్లలున్నారు. భర్త డ్రైవర్ అయినా సరే భార్య, పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునేవాడు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. పనిమీద బయటకు వెళితే వారం అయినా కూడా ఇంటికి రాడు. దీన్ని అదనుగా భావించింది భార్య.


తనను సరిగ్గా చూసుకోవడం లేదంటూ అలకపాన్పు ఎక్కింది. ఎన్నిసార్లు భర్త బుజ్జగించినా వినిపించుకోలేదు సరికదా ఏకంగా తనకన్నా 8 యేళ్ళ తక్కువ వయస్సు కలిగిన యువకుడితో సంబంధం పెట్టుకుని చివరకు జీవితాన్ని నాశనం చేసుకుంది.

 
తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి జిల్లా కెలమంగళానికి చెందిన ఉనిశెట్టి గ్రామంలో నివాసముంటున్న అయ్యప్ప, రూప. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయ్యప్ప జవుళగిరి సమీపంలోని మంచుగిరి గ్రామంలో నివసిస్తున్న సమయంలో అతని బంధువులు తంగమణి, రూపకు పరిచయమయ్యాడు. 

 
భర్త ఉద్యోగ నిమిత్తం వెళితే 10 రోజుల వరకు గానీ రాడు. దీంతో ఆమె బాగా బోర్‌గా ఫీలయ్యేది. పిల్లలు స్కూలుకు వెళ్లిపోవడంతో ఆమె ఒంటరిగా ఫీలయ్యేది. దీంతో యువకుడితో పరిచయం పెట్టుకుంది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి కారణమైంది. 

 
ఇలా పిల్లలు స్కూలుకు వెళితే చాలు వెంటనే ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేసేది. భర్తకు విషయం తెలిసింది. అలా చేయవద్దని  ప్రాధేయపడ్డాడు. కుటుంబం నాశనమైపోతుందని హెచ్చరించాడు. అయినా కూడా ఆమెలో మార్పు రాలేదు. 

 
ప్రియుడితో ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంది. దీంతో భర్త ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కానీ చనిపోలేదు. దీంతో భార్య రూప ప్రియుడితో ప్లాన్ వేసింది. భర్త వల్ల ఇబ్బందులు ఉంటాయని భావించి అతన్ని ఎలాగైనా వదిలించుకోవాలని.. ప్లాన్ వేసింది. ప్రియుడితో కలిసి భర్తను గొంతు నులిమి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది.

 
కానీ పోలీసులు విచారణ జరిపి హత్యగా నిర్థారించి నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. రూప చేసిన పనికి కుటుంబం మొత్తం కూడా చిన్నాభిన్నమైంది. తల్లిదండ్రులు లేకుండా పిల్లలు అనాథలుగా మారిపోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం జ‌గ‌న్ తానే ఒంగి... క‌వి పాదాల‌ను స్పృశించి...