Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అర్థరాత్రి లేచేసరికి భార్య పక్కన ఆమె ప్రియుడు, ఏంటన్నందుకు రోకలి బండతో మోదింది

Advertiesment
అర్థరాత్రి లేచేసరికి భార్య పక్కన ఆమె ప్రియుడు, ఏంటన్నందుకు రోకలి బండతో మోదింది
, బుధవారం, 20 అక్టోబరు 2021 (18:50 IST)
మద్యానికి బానిసైన భర్తతో ఉండలేకపోయింది. పిల్లలు ఉన్నా ఇంటిలో ఉండకుండా బయట తిరగడంతో బోరు కొట్టినట్లు ఫీలయ్యింది. ఒక యువకుడితో పరిచయం పెంచుకుంది. అతనితో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. భర్త తాగి రావడం.. నిద్రిపోతుండడం..ఆమె ప్రియుడితో మంచం కింద ఎంజాయ్ చేయడం జరిగేది. ఇదంతా నెలరోజుల పాటు జరిగింది.

 
తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి జిల్లాలోని రాయకోట్టై సమీపంలోని కొట్టూరులో మారప్పన్‌కు గుండమ్మాల్‌కు 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మారప్పన్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఆర్థిక ఇబ్బందులు లేవు. అయితే మారప్పన్ మద్యానికి బానిస. నిత్యం తాగి ఇంటికి వచ్చేవాడు. తాగుడు ఎంత మానేయమని భార్య ప్రాధేయపడినా వినేవాడు కాదు. పిల్లలు కూడా పెద్దవారయ్యారు. ఇప్పటికైనా మారమని కోరింది భార్య. అయినా మారలేదు.

 
ఒకవైపు రోజూ భర్త తాగి ఇంటికి రావడం.. రాత్రిళ్లు ఆదిమరిచి నిద్రపోవడం.. పిల్లలు కాస్త ఇంటి పట్టున ఉండకుండా బయటకు వెళ్ళి తిరగడంతో ఒంటరిగా ఫీలయ్యింది. తన ఇంటికి అతి సమీపంలో డిగ్రీ పూర్తి చేసిన శివశంకర్ అనే యువకుడితో పరిచయం పెంచుకుంది.

 
ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి కారణమైంది. నెలరోజుల పాటు ఈ బాగోతం నడిచింది. అర్థరాత్రి దాటిన తరువాత శివ శంకర్ ఇంటికి రావడం.. భర్త బెడ్ పైన నిద్రపోతుంటే భార్య బెడ్ కింద ప్రియుడితో రొమాన్స్ ఇలా నడిచేది.

 
అయితే రెండురోజుల క్రితం మద్యం మత్తు దిగి రాత్రి వేళలో బాత్రూంకు వెళుతున్న భర్తకు భార్య ప్రియుడి కనిపించారు. అంతే ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇద్దరిని చితకబాదాడు. దీంతో భార్య ఆగ్రహంతో రోకలి బండను తీసుకుని భర్త తలపై గట్టిగా కొట్టింది. మెదడు బయటకు వచ్చేసి అతను అక్కడికక్కడే చనిపోయాడు.

 
స్థానికులు నిందితులు ఇద్దరినీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మారప్పన్ మృతితో పిల్లలు అనాథలయ్యారు. తమిళనాడు రాష్ట్రంలో ఈ వ్యవహారం కాస్త పెద్ద చర్చకు కారణమైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమిత్ షాపై రాళ్ళు వేయించావ్... ఏ ముఖం పెట్టుకుని క‌లుస్తావ్?