ఆంటీ నా బండెక్కండని పొలాల్లోకి తీసుకెళ్లి మహిళపై ఇంజినీరింగ్ విద్యార్థి...

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (14:46 IST)
సింగరాయకొండ జరుగుమల్లి మండలంలోని చిన్నకుంట శివారులో దారుణం జరిగింది. 52 ఏళ్ల మహిళపై అత్యాచార యత్నం చేయగా ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి చంపేశాడు 23 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి.

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జరుగుమల్లి మండలంలోని నందనవనం గ్రామానికి చెందిన వివాహిత కృష్ణవేణి తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యేందుకు గురువారం ఉదయం కనమళ్ల గ్రామానికి వచ్చారు. శుభకార్యం అనంతరం ఆమె తిరుగుప్రయాణమయ్యారు.

 
ఇంతలో ఆమె దూరపు బంధువైన 23 ఏళ్ల సూర్యతేజ ఆమెను పలుకరించాడు. ఆంటీ మిమ్మల్ని ఊరిలో నేను దిగబెడతానంటూ తన ద్విచక్రవాహనం ఎక్కించుకున్నాడు. చిన్నకుంట వద్దకు రాగానే పొలాల్లోకి వాహనాన్ని తీసుకెళ్లాడు. అక్కడ పొలాల్లో ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు.


ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య చేసాడు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం