Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కె.ఎల్. యూనిర్సిటీలో గ్లోబల్ స్టూడెంట్స్ ఎంట్రప్రెన్యూర్ అవార్డ్స్

Advertiesment
global students entrapenure awards
విజ‌య‌వాడ‌ , బుధవారం, 8 డిశెంబరు 2021 (19:31 IST)
ఆంధ్రప్రదేశ్ ఎంట్రప్రెన్యూర్ ఆర్గనైజేషన్, కె.ఎల్. డీమ్డ్ విశ్వవిద్యాలయం సంయుక్త  ఆధ్వర్యంలో ఈనెల 11న  గ్లోబల్ స్టూడెంట్స్ ఎంట్రప్రెన్యూర్ అవార్డ్స్(GSEA) పోటీలను నిర్వహించనున్నట్లు  కె ఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయ ప్రో ఛాన్సలర్ డాక్టర్ జగన్నాధరావు ప్రకటించారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోటీలకు సంబందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, విద్యార్థి దశలోనే సృజనాత్మక ఆలోచనలు, ఆవిష్కరణలతో  సొంతగా వ్యాపారం చేయాలనుకునే యువ పారిశ్రామిక వేత్తల ప్రతిభను ప్రోత్సాహంచేందుకు ఈ అవార్డులను అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. 
 
 
ఈ అవార్డుల అర్హత పోటీలకు న్యాయనిర్ణేతలుగా శ్రీనివాస హెచ్.ఆర్.సి లిమిటెడ్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్  సి.సురేష్ రాయుడు, బబుల్స్ హెయిర్ బ్యూటీ, ఓల్డ్ స్కూల్ ఇన్స్పిరేషన్స్ ఫౌండర్ వల్లూరుపల్లి స్మిత, హైదరాబాద్ ఏంజిల్స్ ఇన్వెస్ట్‌మెంట్ డైరెక్టర్ ఎస్. రత్నాకర్ వ్యవహరిస్తారని వెల్లడించారు. గ్లోబల్ అవార్డ్స్  ఫైనల్స్‌కు చేరుకోవడానికి విద్యార్థి స్థానిక, జాతీయ క్వాలిఫైయింగ్ రౌండ్‌లో విద్యార్థులు వారి సహచరులతో పోటీపడతారని స్పష్టం చేశారు. విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదగటానికి, వారి లోపాలు తెలుసుకోవటానికి, అనుభవాలను పంచుకోవటానికి ఈ పోటీలు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. 
 
 
విద్యార్థులు ఎంచుకున్న వ్యాపార, వ్యవస్థాపక ప్రయాణాన్ని న్యాయ నిర్ణేతల ముందు ప్రదర్శించడానికి  ఒకసారి అవకాశం ఉంటుందని దీనిని ప్రతీ విద్యార్థి చాలెంజ్ గా తీసుకోవాలని సూచించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారు జాతీయ స్థాయిలో నిర్వహించే అవార్డు పోటీలకు అర్హత సాధిస్తారని స్పష్టం చేశారు. గత సంవత్సరం గ్లోబల్ స్టూడెంట్ ఎంట్రప్రెన్యూర్ అవార్డ్స్(GSEA) జాతీయ ఫైనల్ పోటీలో  ఆంధ్రప్రదేశ్ నుండి గోపిరాజా గెలుపొంది, అవార్డును గెలుచుకున్నారని చెప్పారు.  గ్లోబల్ స్టూడెంట్ ఎంట్రప్రెన్యూర్ అవార్డ్స్ పోటీలో  60 దేశాల నుండి సుమారు  1700 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని  చెప్పారు. 
 
 
విద్యార్థులు సలహాలు సూచనలు కోసం [email protected] www.eonetwork.org సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంద్రప్రదేశ్ ఎంట్రప్రెన్యూర్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు స్మిత, గ్లోబల్ స్టూడెంట్ ఎంట్రప్రెన్యూర్ అవార్డ్స్ చైర్ నీలిమ చల్లగుళ్ల, ఆంద్రప్రదేశ్ ఎంట్రప్రెన్యూర్ ఆర్గనైజేషన్ ఫైనాన్స్ చైర్ రవి మూల్పూరు, ఆంద్రప్రదేశ్ ఎంట్రప్రెన్యూర్ ఆర్గనైజేషన్ మెంబెర్, మెంటర్ అశ్విన్ గణేష్, విశ్వవిద్యాలయం ఇంక్యూబేషన్ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్, ఇంక్యూబేషన్ మెనేజర్  సౌరభ్ కుమార్ హాజరయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రామ స‌చివాల‌యాల్లో బ్యాంకుల ఏటీఎం సేవ‌లు!