7/జి బృందావన కాలనీ లో నటించిన సోనియా అగర్వాల్ కాదల్ కొండేన్ సినిమాలో ఆమె పోషించిన దివ్య పాత్రకు మంచి పేరు వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు సెల్వరాఘవన్ ను తన జీవితంలోకి ఆహ్వానించింది. 2006లో వివాహం అయింది. ఆ తర్వాత సినిమాలకు దూరంగా వుంది. కానీ ఆమె కోరిక గొప్ప నటిగా అవ్వాలని. దాంతో 2009లో వివాహబంధం తెగింది.
ఇక ఒంటరిగా వుంటన్న ఆమె మరో పెండ్లి చేసుకోబోతుందని కొద్దికాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం మేరకు మరో తమిళ దర్శకుడిని ఆమె వివాహం చేసుకోనున్నట్లు కోలివుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ మధ్య ఎన్.టి.ఆర్. నటించిన టెంపర్ లో చిన్న పాత్రలో నటించింది. ఇక ఇప్పుడు తమిళ పరిశ్రమకే అంకితమవ్వాలని అనుకుంటోంది. త్వరలో తమిళ్ డైరెక్టర్ ఎవరనేది తెలియనుంది.