Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిద్రపోతున్న భార్య గొంతుకోసి.. తలను ఠాణాకు తీసుకెళ్లిన కసాయి భర్త

Advertiesment
Hyderabad
హైదరాబాద్ నగరంలోని రాజేంద్ర నగర్‌లో దారుణం జరిగింది. నిద్రపోతున్న భార్యను కట్టుకున్న భర్త అతికిరాతకంగా గొంతుకోశాడు. తర్వాత తలను చేతపట్టుకుని నేరుగా స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, నగరంలోని ఇమాద్ నగర్‌కు చెందిన సమ్రీన్ బేగం అనే అమ్మయిని ఫర్వేజ్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేశారు. అయితే భర్త వేధింపులు భరించలేని ఆమె విడాకులు తీసుకుంది. 
 
ఆ తర్వాత పెద్దల సమక్షంలో మళ్లీ రాజీకొచ్చిన ఫర్వేజ్.. సమ్రీన్‌ను మళ్లీ రెండో పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ అతనిలో మార్పురాలేదు. పైగా సమ్రీన్‌పై అనుమానం పెంచుకున్నాడు. దీంతో నిత్యం వేధించసాగాడు. 
 
ఈ క్రమంలో గురువారం రాత్రి పూటుగా మద్యం సేవించి వచ్చిన ఫర్వేజ్... తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భార్య సమ్రీన్ గాఢ నిద్రలో ఉండగా ఆమె గొంతుకోశాడు. ఆ తర్వాత తలను చేతపట్టుకుని నేరుగా స్టేషన్‌కు తీసుకెళ్లాడు. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ఫర్వేజ్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఘటనాస్థలికి వచ్చిన సమ్రీన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సమ్రీన్ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనవరి 31 వరకు అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం