Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్ 2019 : టాస్ గెలిచిన కోహ్లీ... భారత్ బ్యాటింగ్.. వారిద్దరూ ఔట్

Webdunia
మంగళవారం, 2 జులై 2019 (15:04 IST)
ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా మంగళవారం భారత్ - బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 
 
ఇదే స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. ఈ అనుభవంతో కోహ్లీ తొలుత బ్యాటింగ్‌కు మొగ్గు చూపాడు. పైగా, స్టేడియంలో బౌండరీ లైన్‌లో వ్యత్యాసాలు ఉండటం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు చిక్కులు ఎదురైన సమస్యల దృష్ట్యా కోహ్లీ బ్యాటింగ్‌ను ఎంచుకున్నాడు. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. కుల్దీప్ యాదవ్ స్థానంలో భువనేశ్వర్ కుమార్, కేదార్ జాదవ్ స్థానంలో దినేష్ కార్తీక్‌లకు చోటు కల్పించారు. 
 
భారత జట్టు : కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, ధోనీ, దినేష్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్, షమీ, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చాహల్. ఇక బంగ్లాదేశ్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. 
 
బంగ్లాదేశ్ జట్టు : ఇక్బాల్, సర్కార్, షకీబ్ అల్ హాసన్, రహీం, లిటాన్ దాస్, హోస్సేన్, షబ్బీర్ రెహ్మాన్, సైఫుద్దీన్, మోర్తాజా, రూబెల్ హుస్సేన్, ముస్తాఫర్ రెహ్మాన్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

తర్వాతి కథనం
Show comments