50 మ్యాచ్‌ల్లో నాటౌట్.. ధోనీ రికార్డు అదుర్స్.. కేవలం 2 మ్యాచ్‌ల్లోనే ఓటమి.. (video)

Webdunia
మంగళవారం, 2 జులై 2019 (14:56 IST)
ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2019‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డుల పంట పండించాడు. గత ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ మహేంద్ర సింగ్ ధోని అజేయంగా నిలిచాడు.


2019 ప్రపంచ కప్‌ 38వ మ్యాచ్‌లో ఎంఎస్ ధోని నాటౌట్ 42 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడిపోయినా.. ధోనీ మాత్రం ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
 
ఇప్పటివరకు ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఎంఎస్ ధోని జట్టులో వున్న ఏ మ్యాచ్‌లోనూ ఓటమిని చవిచూడలేదు. ఇంకా ధోనీ వన్డే కెరీర్‌లో కేవలం రెండుసార్లు మాత్రమే టీమిండియా గెలుపును నమోదు చేసుకోలేకపోయింది. 
 
ప్రస్తుతం, ప్రపంచ రికార్డులో, ఎంఎస్ ధోని వన్డే క్రికెట్లో 50 సార్లు అజేయంగా నాటౌట్‌గా నిలిచిన ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా నిలిచాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. టీమిండియా ధోనీ వుండగా కేవలం రెండుసార్లు ఓడిపోగా, ధోని 47 మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచాడు.
 
అంతేగాకుండా 50 వన్డేల్లో అవుట్ కాని ఏకైక బ్యాట్స్‌మన్‌గా ధోనీ నిలిచాడు. వీటిల్లో అత్యధికంగా 2013లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ 54 పరుగులతో అర్థ శతకాన్ని సాధించి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే ప్రస్తుత వన్డే ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 పరుగులు సాధించిన ధోనీ నాటౌట్‌గా నిలిచాడు. 
 
ఈ రెండు మ్యాచ్‌ల్లోనే భారత్ పరాజయం పాలవడం గమనార్హం. ఇప్పటివరకు 40కి పైగా నాటౌట్‌గా నిలిచిన ఆటగాళ్లు ఎవ్వరూ లేరు. కానీ ధోని అజేయ గణాంకాలు చాలా ప్రత్యేకమైనవి, అతని సారథ్యంలోనూ.. అతనకు ఆడే మ్యాచ్‌ల్లో భారత్ 95 శాతానికి పైగా మ్యాచ్‌‍లను గెలుచుకుంటుంది.
 
కానీ ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ సరిగ్గా ఆడలేదని విమర్శలు వచ్చాయి. ఎంఎస్ ధోని ఇంగ్లండ్‌పై మంచి స్ట్రైకర్ రేటును కలిగివున్నాడు.  అతని స్ట్రైకర్ 135 కంటే ఎక్కువ, హార్దిక్ పాండ్యా తరువాత రెండవ అత్యధిక స్ట్రైకర్‌గా వున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments