టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని ప్రస్తుత కెప్టెన్ కోహ్లీ వెనకేసుకొచ్చాడు. ప్రపంచకప్ టోర్నీలో భాగంగా గురువారం వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 125 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌కు చేరువైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీ బ్యాటింగ్ సరిగ్గా చేయలేదని.. వేగం కొరవడిందని వీవీఎస్ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై కోహ్లీ స్పందించాడు.
ధోనీ మ్యాచ్ చివరి వరకు వుంటే ఏం చేయగలడో అందరికీ తెలుసునని కోహ్లీ ప్రశంసించాడు. ఒక్క రోజు విఫలమైన మాత్రానా ఆతనిపై విమర్శలు చేస్తారు. తాము మాత్రం ధోనీకి మద్దతుగా వుంటామని చెప్పాడు. భారత్‌కు అతడు ఎన్నో విజయాలు అందించాడు. టెయిలెండర్స్‌తో కలిసి ఎలా బ్యాటింగ్ చేయాలో మహీకంటే బాగా ఎవరికీ తెలియదని కోహ్లీ వ్యాఖ్యానించాడు.
జట్టుకు ఎంత స్కోరు చేస్తే సరిపోతుందో అతడు కచ్చితంగా చెప్పగలడు. అతడు 265 పరుగులు సరిపోతాయంటే మేమేం 300 కోసం ఆడమన్నాడు. అలాగని 230తో సరిపెట్టుకోం. అతడు క్రికెట్ దిగ్గజం అన్న సంగతి మాకు తెలుసునని కోహ్లీ తెలిపాడు.