Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్రిస్ గేల్ ఫీల్డింగ్‌కు ఫిదా... బ్యాట్‌ను తడుతూ... కోహ్లీ ప్రశంసలు ఫోటోలు వైరల్

Advertiesment
క్రిస్ గేల్ ఫీల్డింగ్‌కు ఫిదా... బ్యాట్‌ను తడుతూ... కోహ్లీ ప్రశంసలు ఫోటోలు వైరల్
, శుక్రవారం, 28 జూన్ 2019 (09:28 IST)
భారత్-వెస్టిండీస్‌‌ల మధ్య జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో విండీస్ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్ ఫీల్డింగ్‌లో అబ్బురపరిచాడు. సాధారణంగా వెస్టిండీస్ ఓపెన‌ర్‌గా వ‌చ్చే క్రిస్ గేల్ ఒక్క‌సారి క్రీజులో కుదురుకున్నాడంటే బౌల‌ర్ల‌కు ప‌ట్ట‌ప‌గ‌లు చుక్క‌లు క‌నిపిస్తాయి. అలాంటి స్టార్ ప్లేయర్ భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డిం్ అదరగొట్టేశాడు. 
 
క్రిస్ గేల్ ఫీల్డింగ్ పొజీష‌న్ స్పిప్‌. స్లిప్ ఫీల్డింగ్‌లో ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాడు క్రిస్ గేల్‌. అదే పొజీష‌న్‌లో ఉంటూ ప్రస్తుతం అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడత‌ను. అత‌ని ఫీల్డింగ్ సోష‌ల్ మీడియా ఫిదా అయిపోయింది. స‌లాం కొడుతోంది.
 
అంతేగాకుండా క్రిస్ గేల్ ఫీల్డింగ్‌ను చూసిన అభిమానులు ఫిదా అయిపోయారు. గ‌ట్టిగా చ‌ప్ప‌ట్లు కొడుతూ త‌మ ఆనందాన్ని వ్య‌క్తంచేశారు ప్రేక్ష‌కులు. దీనికి విచిత్రంగా స్పందించాడు గేల్‌. రెండు చేతులు ఎత్తి ఆశీర్వ‌దిస్తున్న త‌ర‌హాలో వారికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకొన్నాడు. ఆ వెంట‌నే- దీనిపై మెమెలు రెడీ అయిపోయాయి. బాబా క్రిస్ గేల్ ప్రేక్ష‌కుల‌ను ఆశీర్వ‌దిస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజ‌న్లు, ట్విట్ట‌రెట్టీలు. గేల్ ఫీల్డింగ్‌ను విరాట్ కోహ్లీ సైతం ప్ర‌శంసించ‌కుండా ఉండ‌లేక‌పోయారు. త‌న బ్యాట్‌ను త‌డుతూ కోహ్లీ కనిపించాడు. ప్రస్తుతం గేల్ ఫీల్డింగ్‌కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనీపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. టీమిండియా గెలిచింది కాబట్టి?