Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని రివర్స్ తీసుకున్న క్రిస్ గేల్..? (video)

రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని రివర్స్ తీసుకున్న క్రిస్ గేల్..? (video)
, గురువారం, 27 జూన్ 2019 (11:42 IST)
విండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. త్వరలో తాను అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు గేల్ ప్రకటించాడు. విండీస్‌లో టీమిండియాతో జరిగే టెస్టు సీరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుండి తప్పుకోనున్నట్లు గేల్ ప్రకటించాడు. కాగా ఐసీసీ వరల్డ్‌కప్ తర్వాత క్రికెట్‌కి గుడ్‌బై చెబుతానని గేల్ గతంలోనే ప్రకటించాడు. 
 
తాజాగా తాను రిటైర్మెంట్ నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు ప్రకటించాడు. మంచి ఫేర్‌వెల్ సీరీస్ లభించాలనే ఆలోచనతో ఇండియా సీరీస్ తర్వాత రిటైర్ కావాలని గేల్ భావించినట్లు సమాచారం. ఇండియాతో జరగనున్న మ్యాచ్‌కి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో తన రిటైర్‌మెంట్ గురించి ప్రస్తావించాడు.

ఇది ముగింపు కాదని, ఇంకొన్ని మ్యాచ్‌లు ఆడుతానని, ప్రపంచకప్ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అంటూ వ్యాఖ్యానించాడు. ప్రపంచకప్ తర్వాత ఇండియాతో ఒక టెస్ట్ మ్యాచ్‌ ఆడుతాను. టీ-20, వన్డేలు ఖచ్చితంగా ఆడుతానని అన్నాడు.
 
జమైకాలోని కింగ్స్‌స్టన్‌లో గేల్ పుట్టారు. 1999లో అంతర్జాతీయ జట్టులోకి అరంగేట్రం చేశాడు. టీమిండియాతో జరిగిన వన్డే మ్యాచ్‌తో క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. తన క్రికెట్ కెరీర్‌లో 103 టెస్టులు, 295 వన్డేలు, 58 టీ-20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 7,214, వన్డేల్లో 10,345, టీ-20ల్లో 1,627 పరుగులు చేశాడు. 
 
విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. వెస్టిండీస్ జట్టు ఆగస్టులో టీమిండియాతో మూడు టీ-20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. వెస్టిండీస్, అమెరికా దేశాల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోహ్లీ సేన జోరును ఆపతరమా? వెస్టిండీస్‌తో నేడు భారత్ ఢీ