Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇద్దరూ ఇద్దరే.. భిన్నమైన వ్యక్తిత్వాలున్నా.. వారిద్దరూ ఛాంపియన్లే...

ఇద్దరూ ఇద్దరే.. భిన్నమైన వ్యక్తిత్వాలున్నా.. వారిద్దరూ ఛాంపియన్లే...
, శనివారం, 29 జూన్ 2019 (14:26 IST)
ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా, భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపుతోంది. ఈ టోర్నీలో భాగంగా, ఆదివారం ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీల గురించి జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ ఇద్దరు భిన్నమైన వ్యక్త్వాలు ఉన్న ఆటగాళ్ళు అంటూ ఓ కోహ్లీ - ధోనీలతో కలిసి తాను ఉన్న ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దానికింద.... భిన్నమైన వ్యక్తిత్వాలు ఉన్నా.. ఈ ఇద్దరూ ఛాంపియన్లే అంటూ తనదైనశైలిలో శాస్త్రి కామెంట్ చేశారు. 
 
ముఖ్యంగా, మైదానంలో ఆటను విశ్లేషించుకుని.. ముందుకు సాగే విధానం ఇద్ద‌రిలో వేరైనా.. తమ వ్యూహాలను స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేస్తార‌ని శాస్త్రి అన్నారు. కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో ధోనీ వ‌ద్ద కోహ్లీ స‌ల‌హాలు తీసుకుంటాడు. మ‌రికొన్ని సంద‌ర్భాల్లో కోహ్లీ వ‌ద్ద ధోనీ స‌ల‌హాలు తీసుకుంటాడని శాస్త్రి చెప్పుకొచ్చాడు. 
 
కాగా, ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్‌లో పలు కీలక మ్యాచ్‌లలో ధోనీ చాలా నెమ్మెదిగా, విసుగుపుట్టించేలా బ్యాటింగ్ చేస్తున్నాడు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే, కెప్టెన్ కోహ్లీ మాత్రం ధోనీకి అండ‌గా నిలిచాడు. 
 
"స్లో స్టార్ట్ ఇచ్చినా.. ధోనీ ఫినిషింగ్ ట‌చ్ ఇవ్వ‌డంలో బెస్ట్" అని కోహ్లీ కితాబుఇచ్చాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో చివ‌రి ఓవ‌ర్‌లో ధోనీ రెండు సిక్స‌ర్లు కొట్టి భార‌త్‌కు గౌర‌వప్ర‌ద‌మైన స్కోర్‌ను అందించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత బౌలర్లు తమ వంతు పని పూర్తి చేయడంతో కరేబియన్లు చిత్తుగా ఓడిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరెంజ్ రంగు దుస్తుల్లో టీమిండియా.. కొత్త అవతారంలో కోహ్లీ సేన