Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బోరుమని ఏడుస్తున్న వకార్ యూనిస్... భారత్ కావాలనే ఓడిందట

Advertiesment
బోరుమని ఏడుస్తున్న వకార్ యూనిస్... భారత్ కావాలనే ఓడిందట
, మంగళవారం, 2 జులై 2019 (12:37 IST)
పాకిస్థాన్ సీనియర్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ బోరున ఏడుస్తున్నారు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో గత ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. ఇంగ్లండ్ నిర్ధేశించిన 338 పరుగులు భారీ భాగస్వామ్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఐదు వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. దీంతో 36 పరుగులతో తేడాతో ఓడిపోయింది. ఇంగ్లండ్ గెలుపుతో పాకిస్థాన్ క్రికెట్ జట్టు సెమీస్ దారులు మూసుకునిపోయాయి. 
 
దీనిపై వకార్ యూనిస్ స్పందిస్తూ, పాక్ సెమీస్ ఆశలపై నీళ్లు కుమ్మరించాలనే ఉద్దేశంతోనే భారత్ ఆడినట్టు కనిపించిందని ధ్వజమెత్తాడు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే పాక్‌కు సెమీస్ అవకాశాలు పుష్కలంగా ఉండేవి. అందుకే, కోహ్లీ సేన గెలవాలంటూ పాక్ అభిమానులు ప్రార్థనలు చేశారు. అయితే, భారత జట్టు పరాజయంతో వారి ఆశలు అడుగంటాయని పేర్కొన్నారు. 
 
ఈ నేపథ్యంలో వకార్ యూనిస్ ట్వీట్ ద్వారా భారత్‌పై తనకున్న అక్కసును బయటపెట్టాడు. పాకిస్థాన్ సెమీస్‌కు వెళ్తుందా? లేదా? అన్నదానిపై తనకు పెద్దగా పట్టింపు లేదని, కానీ కొందరు చాంపియన్ల క్రీడాస్ఫూర్తి దారుణంగా ఉందంటూ పరోక్షంగా భారత ఆటగాళ్లపై విమర్శలు గుప్పించాడు. ఇంగ్లండ్-భారత్ మ్యాచ్ పాక్‌కు జీవన్మరణ సమస్యలా మారిన నేపథ్యంలో ఇంగ్లండ్ గెలుపును వకార్ జీర్ణించుకోలేకపోయినట్టుగా ఆ ట్వీట్ ద్వారా తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ : వన్డేల్లో ఎవరి సత్తా ఎంత?