Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవిటితనం ఓడింది... ఆశయం గెలిచింది....

Advertiesment
అవిటితనం ఓడింది... ఆశయం గెలిచింది....
, బుధవారం, 22 మే 2019 (13:33 IST)
తనకు ఊహ తెలిసినప్పటి నుంచే అవిటితనంతో బాధపడుతున్నాడు. పైగా, అతని కుటుంబం నిరుపేద ఫ్యామిలీ. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. అలాంటి కుటుంబం నుంచి పైకి వచ్చిన ఓ యువకుడు ఇపుడు ఎంతోమందికి స్ఫూర్తిప్రదాత. అతనిపేరు ధీరావత్ మహేష్. ఊరు హైదరాబాద్‌లోని షామీర్ పేట. క్రికెట్, బీచ్ వాలీబాల్ దివ్యాంగ క్రీడాల్లో ఏకకాంలో దేశానికే ప్రాతినిధ్యం వహించిన అరుదైన ఘనత గిరిజన క్రీడాకారుడు. ఒక చేయి లేకపోయినప్పటికీ.. క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. అతని గురించి ఇపుడు తెలుసుకుందాం. 
 
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలోని శామీర్‌పేట మండలం మూడుచింతలపల్లి గ్రామానికి చెందిన మహేష్.. ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు బిల్డింగ్ నుంచి జారిపడటంతో కుడిచేతిని మోచేయి వరకు కోల్పోయాడు. కానీ, ఒంటి చేత్తోనే ఎన్నో మిరాకిల్స్ చేస్తున్నాడు. ఈ మధ్యే చైనాలోని ప్యూజియామాలో జరుగనున్న అంతర్జాతీయ దివ్యాంగుల బీచ్ వాలీబాల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ యేడాదిలోనే జరగనున్న దివ్యాంగుల క్రికెట్ వరల్డ్‌ కప్ ఇండియా టీమ్‌కి వైస్ కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు. దేశానికి వరల్డ్ కప్ అందిచడమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. మంచి ఆల్ రౌండర్ అయిన మహేష్ రానున్న వరల్డ్ కప్‌లో సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నాడు.
 
తన ఆశయాన్ని నెరవేర్చుకోవడం కోసం ఒక చేయి లేదని ఏనాడూ బాధపడలేదు. తన మిత్రుల సహాయ సహకారాలతో ఒంటిచేత్తోనే బైక్ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. క్రీడల్లోనూ రాణిస్తూ సత్తాచాటాడు. ఆ ప్రతిభతోనే మహేష్ పలుమార్లు జిల్లా, రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్లలో పాల్గొని తన ప్రతిభను నిరూపించాడు. ఎన్నో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు అందుకున్నాడు. అదే జోరుతో రాష్ట్ర జట్టుకు ఆడి వరల్డ్ కప్ జట్టు ఎంపికలో భాగంగా దేశవ్యాప్తంగా 1200 మంది దివ్యాంగులు పోటీపడి జట్టులో స్థానం దక్కించుకున్నాడు. చివరకు ఏకంగా జట్టుకే వైస్ కెప్టెన్ బాధ్యతలు అందుకున్నాడు.
 
మహేష్‌కు క్రీడలంటే అమితమైన యిష్టం. అలాగే, కేటీఆర్ అన్నాకూడా అంతే ఇష్టం. అందుకే కేటీఆర్ ముఖచిత్రాన్ని తన గుండెల మీద పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. దీంతో పాటు బీచ్ వాలీబాల్ టోర్నీలో పాల్గొనేందుకు చైనా వెళ్లేందుకు మహేష్‌కు కేటీఆర్ సైతం లక్ష రూపాయలు ఆర్థికసాయం చేశాడు. దీంతో కేటీఆర్‌పై మహేష్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. రానున్న వరల్డ్ కప్‌లో టైటిల్ నెగ్గి తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో పెంచుతానంటున్నాడు. 
 
ఇక తెలంగాణ నుంచి ప్రపంచ దివ్యాంగుల క్రికెట్ కప్‌కు ఎంపికయ్యాడు. మొత్తానికి ఆశయానికి అంగవైకల్యం అడ్డుకాదని ధీరావత్ మహేష్‌ను చూస్తే తెలుస్తోంది. భారత జట్టులోనే వైస్‌కెప్టెన్ స్థానాన్ని దక్కించుకున్న మహేష్.. విశ్వసమరంలో సత్తా చాటి తెలంగాణ ఖ్యాతిని మరింత పెంచాలని మనం ఆశిద్దాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగా ఈవెంట్.. వరల్డ్ కప్ కోసం.. ఇంగ్లండ్‌కు బయల్దేరిన కోహ్లీ సేన