మెగా ఈవెంట్.. వరల్డ్ కప్ కోసం.. ఇంగ్లండ్‌కు బయల్దేరిన కోహ్లీ సేన

బుధవారం, 22 మే 2019 (12:33 IST)
కొద్దిరోజుల్లో ప్రారంభమయ్యే ప్రపంచకప్‌కి టీమిండియా సర్వసన్నద్ధం అయ్యింది. ఈనెల 30వ తేదీన ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా ఇంగ్లండ్‌కు బయలుదేరింది.


కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఇవాళ తెల్లవారుజామున ముంబై ఎయిర్‌పోర్టులో ఇంగ్లండ్‌ విమానమెక్కింది. ఈ సందర్భంగా టీమిండియాకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 
 
టీమిండియా ఇంగ్లండ్‌కు బయలుదేరే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు తమ అభిమాన క్రికెటర్‌లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 
 
టీమిండియా ఆటాగాళ్లతో పాటు సపోర్ట్‌ స్టాఫ్‌ కూడా అధికారిక బ్లేజర్లు ధరించి ప్రయాణానికి సిద్ధమయ్యారు. ప్రపంచకప్‌లో జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది. అంతకంటే ముందు న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌లో రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడుతుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం వరల్డ్ కప్‌ మ్యాచ్‌లను ఎంజాయ్ చేస్తూ రాణిస్తే కప్ మనదే : కోహ్లీ