Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యానికి బానిసయ్యాను.. పిస్టల్‌తో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డా: ప్రవీణ్ కుమార్

Webdunia
గురువారం, 23 జనవరి 2020 (11:02 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మానసిక ఒత్తిడి కారణంగా పిస్టల్‌‍తో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపాడు. గత 2007వ సంవత్సరం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో క్రికెట్ అరంగేట్రం చేసిన ప్రవీణ్ కుమార్.. ఆపై జట్టులో స్థానం దక్కకపోవడంతో ఒత్తిడికి గురయ్యాడు. అటు పిమ్మట క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 
 
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. తన ప్రతిభకు మంచి గుర్తింపు లభించలేదన్నాడు. తాను నిరాశకు చెందానని.. ఒంటరిగా వున్నప్పుడు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని తెలిపాడు. అలా మద్యానికి కూడా బానిస అయ్యానని చెప్పాడు. అలా ఓ రోజు రాత్రి పిస్టల్‌తో ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

అయితే తన పిల్లల ముఖాన్ని చూసి ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గానని ప్రవీణ్ కుమార్ చెప్పాడు. కానీ మద్యానికి ప్రస్తుతం బానిస కానని చెప్పాడు. ప్రస్తుతానికి ఒత్తిడి నుంచి ఆమడ దూరానికి వచ్చేశానని తెలిపాడు. 
 
కాగా.. భారత జట్టుకోసం ఆడిన ప్రవీణ్ కుమార్.. 68 వన్డేల్లో ఆడాడు. 77 వికెట్లు పడగొట్టాడు. ఆరు టెస్టుల్లో ఆడి 27 వికెట్లను సాధించాడు. చివరికి 2012వ సంవత్సరం పాకిస్థాన్ జట్టులో ఆడాడు. ఆ తర్వాత క్రికెట్‌కు దూరమై 2018వ సంవత్సరం రిటైర్మెంట్ ప్రకటించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తర్వాతి కథనం
Show comments