బెంగూళూరు వన్డే : ఆస్ట్రేలియా బ్యాటింగ్ - భారత్‌కు అగ్నిపరీక్ష

ఆదివారం, 19 జనవరి 2020 (14:50 IST)
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ క్రికెట్ జట్ల మధ్య నిర్ణయాత్మక వన్డే మ్యాచ్ బెంగుళూరులో జరుగుతోంది. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. స్థానిక చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. 
 
ఆసీస్‌ జట్టులో రిచర్డ్‌సన్‌ స్థానంలో హేజల్‌వుడ్‌ వచ్చి చేరగా, భారత జట్టులో ఎలాంటి మార్పు లేదు. కాగా ఇరు జట్లు సిరీస్‌లో ఇప్పటికే 1-1తో సమ ఉజ్జీలుగా నిలవగా ఆఖరిదైన ఇవాళ్టి వన్డే విజేతను నిర్ణయించనుంది. ఇక ఇరు జట్ల వివరాలు ఇలా ఉన్నాయి. తొలి వన్డేలో ఆస్ట్రేలియా గెలుపొందగా, రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. 
 
ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల వివరాలను పరిశీలిస్తే, 
భారత్‌: రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), శ్రేయాస్‌ అయ్యర్‌, లోకేష్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), మనీష్‌ పాండే, రవీంద్ర జడేజా, మహమ్మద్‌ షమీ, నవదీప్‌ సైనీ, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్‌ప్రిత్‌ బుమ్రా. 
 
ఆస్ట్రేలియా: డేవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌ (కెప్టెన్‌), స్టీవెన్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌, అలెక్స్‌ కేరే (వికెట్‌ కీపర్‌), యాష్టన్‌ టర్నర్‌, యాష్టన్‌ అగర్‌, ప్యాట్‌ కమ్మిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హేజల్‌వుడ్‌, ఆడమ్‌ జంపా. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం హార్దిక్‌ పాండ్యా‌ కోసం సెలెక్షన్‌‌ వాయిదా వేశారు...