Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శిఖర్ ధావన్ అదిరే ఇన్నింగ్స్.. కంగారూలకు చుక్కలు (video)

Advertiesment
శిఖర్ ధావన్ అదిరే ఇన్నింగ్స్.. కంగారూలకు చుక్కలు (video)
, శుక్రవారం, 17 జనవరి 2020 (18:20 IST)
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మెన్లు అద్భుతంగా రాణించారు. తమ బ్యాట్‌కు పనిచెప్పి.. కంగారూలకు చుక్కలు చూపించారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్ (96; 90 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌) దంచి కొచ్చాడు. 
 
కెప్టెన్ విరాట్ కోహ్లీ (78; 76 బంతుల్లో 6 ఫోర్లు), కేఎల్ రాహుల్ (80; 52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులు) సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్ 340 పరుగుల స్కోరు సాధించింది. ఫలితంగా ఆస్ట్రేలియా ముందు 341 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 
 
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో టీమిండియా ఇన్నింగ్స్‌ను రోహిత్‌-శిఖర్‌ ధావన్‌లు ఆరంభించారు. వీరిద్దరూ సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రోహిత్‌ ఔటయ్యాడు. ఆడమ్ జంపా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ జోడి తొలి వికెట్‌కు 81 పరుగులు జోడించింది. ఆపై కోహ్లీ ఫస్ట్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. 
 
ధావన్-కోహ్లీ సమయోచితంగా ఆడి స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ధావన్ గేర్ మర్చి ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సెంచరీకి సరిగ్గా నాలుగు పరుగుల ముందు అవుటయ్యాడు. అయినా అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోరు సంపాదించి పెట్టడంలో శిఖర్ ధావన్ అదిరే ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ పెవిలియన్ చేరినా.. రవీంద్ర జడేజా అండతో రాహుల్ పరుగుల వరద పారించాడు. 
 
యువ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ 52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 80 పరుగులు చేశాడు. రాహుల్ కళాత్మక ఆటతీరుతో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించడం హైలైట్ గా నిలిచింది.  ఓపెనర్ రోహిత్ శర్మ 42 పరుగులు చేయగా, చివర్లో రవీంద్ర జడేజా 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆడమ్‌ జంపా మూడు వికెట్లు పడగొట్టాడు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనీ కెరీర్ ముగిసినట్టేనా? బీసీసీఐ కాంట్రాక్టుల జాబితాలో కనిపించని పేరు!